అస్సాంలో బీజేపీ దూకుడు  | BJP, Congress fight in Assam elections | Sakshi
Sakshi News home page

అస్సాంలో బీజేపీ దూకుడు 

Mar 21 2026 4:58 AM | Updated on Mar 21 2026 5:52 AM

BJP, Congress fight in Assam elections

హ్యాట్రిక్‌పై కాషాయ పార్టీ గురి ∙వలసలతో డీలా పడ్డ  కాంగ్రెస్‌

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్‌ నడుమ మరోసారి హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ఈసారి హ్యాట్రిక్‌ కొట్టేందుకు ఉవి్వళ్లూరుతోంది. కాషాయ పార్టీ ఆశలను వమ్ము చేసి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. రెండు పారీ్టలూ భాగస్వాములతో పొత్తుల ప్రక్రియను పూర్తి చేసుకుని పోటాపోటీగా అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. రాష్ట్రమంతటా ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి కూడా. అయితే సీఎం హిమంత సారథ్యంలో దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని కాంగ్రెస్‌ ఏ మేరకు అడ్డుకుంటుందన్నది ఆసక్తికరం... 

చొరబాట్లు, అస్తిత్వ, హిందూత్వ–ముస్లిం రాజకీయాలు. ఇవే అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తేల్చేలా కని్పస్తున్న ప్రధానాంశాలు. అస్సామీల అస్తిత్వం, భూముల పరిరక్షకునిగా ముఖ్యమంత్రి సాధించిన హిమంత బిశ్వశర్మ ఇమేజీ బీజేపీకి పెద్ద సానుకూలతగా కనిపిస్తోంది. అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆయన సర్కారు ఉక్కుపాదం మోపింది. భూమి లేని స్థానికులకు, తేయాకు కారి్మక కుటుంబాలకు భూ పట్టాలిచి్చంది. 

వీటికితోడు మహిళలు, విద్యార్థులు, యువత కోసం రూ.5,000 కోట్లతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఎన్డీఏ భాగస్వాములైన అస్సాం గణ పరిషద్‌ (ఏజీపీ), బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (బీపీఎఫ్‌), యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌ (యూపీపీఎల్‌), రభా హసోంగ్‌ జతా మంచ్‌ వంటివాటితో బీజేపీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ కూడా సజావుగా సాగిపోయింది. ఏజీపీకి 26, బీపీఎఫ్‌కు 11 స్థానాలు కేటాయించింది. మోదీ కరిష్మాకు సీఎం హిమత జనాదరణ కూడా తోడవనుంది. ఇక కాంగ్రెస్‌ మరోసారి వామపక్షాలు, రాయ్‌జోర్‌ దళ్, అస్సాం జాతీయ పరిషద్‌ వంటి పార్టీలతో జట్టు కట్టింది. కానీ నేతల వలసలు కాంగ్రెస్‌ను కుంగదీస్తున్నాయి. 

పీసీసీ మాజీ చీఫ్‌ భూపేన్‌ బోరా, మాజీ ఎంపీ ప్రద్యోత్‌ బోర్డోలోయ్‌ ఇటీవల పార్టీని వీడారు. దీనికి తోడు పీసీసీ చీఫ్‌ గౌరవ్‌ గొగొయ్‌ ఏకంగా పాకిస్తానీ ఏజెంట్‌ అంటూ సీఎం హిమంత చేస్తున్న ఆరోపణలు ఓటర్లపై ప్రభావం చూపుతున్నాయి. హిందూ నేతలకు కూడా కాంగ్రెస్‌లో కనీస గౌరవం లేదంటూ ర్యాలీల్లో ఆయన పదేపదే చేస్తున్న విమర్శలకు కూడా మంచి స్పందన కనిపిస్తోంది. వీటికి తోడు నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ కూడా కాంగ్రెస్‌ను బాగానే దెబ్బ తీసింది. ఆ పార్టీ సులువుగా గెలవగలిగిన ముస్లిం ప్రాబల్య స్థానాల సంఖ్యకు గండి పడింది. బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకతపైనే గట్టిగా ఆశలు పెట్టుకుంది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement