Bipin Rawat: పూర్తయిన బిపిన్‌ రావత్‌ దంపతుల అంత్యక్రియలు

Bipin Rawat Last Remains Brought His Residence Funeral Brar Square Cemetery - Sakshi

05:18PM
బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటికలో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్ దంపతుల అంతిమ సంస్కారాలు సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. సీడీఎస్ రావత్‌కు 17 గన్‌ సెల్యూట్‌తో ఘనంగా నివాళులు అర్పించింది భారత సైన్యం. త్రివిధ దళాల్లోని అన్ని ర్యాంకులకు చెందిన 99మంది సైనికాధికారులు.. 33 మందితో కూడిన ట్రై సర్వీస్‌ బ్యాండ్‌ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. త్రివిధ దళాలకు చెందిన మొత్తం 800మంది సేవా సిబ్బంది అంత్యక్రియాల్లో పాలుపంచుకున్నారు. శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌కు చెందిన సీనియర్ మిలటరీ కమాండర్లు జనరల్ రావత్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు.

03:30PM
దారిపొడవునా జనరల్‌ రావత్‌కు జననీరాజనం

03:15PM
కన్నీటి వీడ్కోలు
సైనిక వీరుడికి తుది వీడ్కోలు పలుకుతున్న ఢిల్లీ ప్రజలు
కొనసాగుతున్న జనరల్‌ బిపిన్‌ రావత్‌ అంతిమయాత్ర
భారత్‌ మాతాకీ జై నినాదాలతో హోరెత్తుతున్న ఢిల్లీ

02:10PM
మధ్యాహ్నం 2 గంటలకు రావత్‌ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటికలో రావత్‌ దంపతులు అంత్యక్రియలు జరుగుతాయి.

సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్‌ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన భారత తొలి సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దంపతుల మృత దేహాలను శుక్రవారం ఢిల్లీలోని వారి నివాసానికి తరలించారు. ప్రజల సందర్శన కోసం రావత్‌ దంపతుల పార్థివదేహాలను ఢిల్లీలోని కామరాజ్‌ మార్గ్‌ నివాసంలో ఉంచారు.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి అమిత్‌ షా, ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బజాల్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ తదితరలు శుక్రవారం రావత్ ఇంటికి చేరుకుని.. దంపతులకు నివాళులర్పించారు.  
(చదవండి: హెలికాప్టర్‌ ప్రమాదం: ఢిల్లీకి పార్థివ దేహాలు)

 

చదవండి: ప్రమోషన్‌ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top