రంగు మారనున్న గరీబ్‌ రథ్‌.. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు! | Big Change in Garib Rath Train | Sakshi
Sakshi News home page

Garib Rath: రంగు మారనున్న గరీబ్‌ రథ్‌.. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు!

Published Sat, Apr 6 2024 1:45 PM | Last Updated on Sat, Apr 6 2024 2:57 PM

Big Change in Garib Rath Train - Sakshi

అందరికీ ఏసీ కోచ్‌లలో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో రైల్వేశాఖ గరీబ్ రథ్ రైలును ప్రారంభించింది. ఇప్పుడు ఈ రైలులో పలు మార్పులు సంతరించుకుంటున్నాయి. బోగీల సంఖ్యను పెంచడంతోపాటు, రంగు కూడా మార్చనున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ గరీబ్ రథ్‌లో చోటుచేసుకోబోయే మార్పులను మీడియాకు తెలియజేశారు. 

బీహార్‌కు అనుసంధానమైన అన్ని గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లలో సీట్ల సంఖ్యను పెంచనున్నారు. ముజఫర్‌పూర్-ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడుస్తున్న రైలు నంబర్ 12211/12 గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌తో సహా బీహార్‌ మీదుగా వెళ్లే గరీబ్‌రథ్‌ గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లను లింక్ హాఫ్‌మన్ బుష్‌గా మార్చనున్నారు. ఈ మార్పుల తరువాత గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్ 16 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లతో నడుస్తుంది. 

దీంతో ఒక్కో గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో 352 బెర్త్‌లు పెరగనున్నాయి. ఈ రైళ్లకు కొత్త త్రీ టైర్ ఎకానమీ కోచ్‌ను అనుసంధానం చేయనున్నారు. దీంతో గతంలో కంటే ఎక్కువ మంది ఒకేసారి ప్రయాణించే అవకాశం ఏర్పాడుతుంది. ఇప్పటివరకూ ఆకుపచ్చ రంగుతో విభిన్నంగా కనిపించిన గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ఇకపై ఎరుపు రంగులో కనిపించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement