ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎంగా ఎంపిక

Bhupendra Patel Elected As Gujarat New CM - Sakshi

రేపు ప్రమాణస్వీకారం చేయనున్న భూపేంద్ర

హాజరుకానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

గాంధీనగర్‌: గుజరాత్‌ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా పటేల్‌ను ఎన్నుకుంది. భూపేంద్ర పటేల్‌ ఘట్లోడియా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేంద్ర పరిశీలకులుగా విచ్చేసిన నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో ఆదివారం సమావేశమైన శాసనసభాపక్షం ఈ మేరకు భూపేంద్ర పటేల్‌ను ఎన్నుకుంది. సోమవారం భూపేంద్ర పటేల్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
చదవండి: కాంగ్రెస్‌కు ఊహించని షాక్: హాట్‌హాట్‌గా ఉత్తరాఖండ్‌ రాజకీయం

పటేల్‌ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయంతో ముఖ్యమంత్రిగా భూపేంద్ర పేరును ఖరారు చేశారు. విజయ్‌ రూపానీ శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ మేరకు బీజేపీ వ్యూహం రచిస్తోంది. అందులో భాగంగా ఆ రాష్ట్రంలో పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. పాటిదార్ సామాజిక వర్గానికే సీఎం, డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ కొనసాగనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు జరిగే భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

భూపేంద్ర చరిత్ర

  • పూర్తి పేరు: భూపేంద్రభాయి రజనీకాంత్ భాయి పటేల్‌
  • ఘట్లోడియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2017 ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ విజయం. తన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీకి చెందిన శశికాంత్ పటేల్ పై లక్షా 17 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది రికార్డ్ నెలకొల్పారు.
  • అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్‌గా బాధ్యతలు
  • అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (AUDA) చైర్మన్‌గా విధులు
  • మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌కు సన్నిహితుడుగా పేరు
  • పటీదార్ కమ్యూనిటీకి చెందిన భూపేంద్ర పటేల్, పటీదార్ సంస్థలు సర్దార్ ధామ్, విశ్వ ఉమియా ఫౌండేషన్‌ల ట్రస్టీగా ఉన్నారు.
  • 1999-2000లో మేమ్‌నగర్ నగర్‌పాలిక అధ్యక్షుడు
  • 2008-10లో AMC స్కూల్ బోర్డ్ వైస్ ఛైర్మన్
  • 2010-15లో తల్తేజ్ వార్డ్ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నిక

చదవండి: ‘ఆ కుండ తయారు చేసిందెవరో.. వారికి రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్ట్‌ ఇద్దాం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top