కరోనా మృతదేహాలకు... వారే ఆ నలుగురై...!

Bengaluru Volunteer Group Ensures Dignity In Death For Covid Victims - Sakshi

బెంగళూరు: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో చనిపోయే వారి సంఖ్య కూడా రోజు పెరుగుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో స్మశాన వాటికల్లో స్థలం సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఇంకా కొన్ని సంఘటనల్లో  కరోనాతో చనిపోయే వారికి బంధువులు అంత్యక్రియలు చేయలేని పరిస్థితి. మరికొన్ని సంఘటనల్లో జేసీబీ వాహనాలను ఉపయోగించి మృత దేహాలను ఖననం చేసే పరిస్థితి ఏర్పడింది. చనిపోయిన వారికి ఎలాంటి గౌరవం ఇవ్వకుండా అంత్యక్రియలు చేస్తున్నారు. కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియల్లో ‘ఆ నలుగురు’ అనే వారే లేకుండా పోయారు. 

ఈ సమయంలో  బెంగళూరుకు చెందిన ‘మేర్సి ఎంజిల్స్‌’ ఎన్జీవో కరోనా మృత దేహాలకు ఆ నలుగురై అన్ని గౌరవ మర్యాదలతో  అంత్యక్రియలను నిర్వ హిస్తున్నారు. కోవిడ్‌తో మరణించిన అన్ని మతాలవారిని, వారి మతాలకు అనుగుణంగా అంత్యక్రియలను నిర్వ హిస్తున్నారు. ఈ ఎన్జీవోకు చెందిన అన్నే మోరిస్ గత ఏడాది సుమారు 120కు కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు చేశారు. ఈ సంవత్సరం సుమారు 600 పైగా చేశానని తెలిపారు. ప్రస్తుతం కరోనా ఉదృతితో మృత దేహాల సంఖ్య మరిచిపోయానని పేర్కొంది. కరోనా మృత దేహాలకు కొవిడ్‌-19 మార్గదర్శకాలకు అనుగుణంగా అంత్యక్రియలను చేస్తున్నారు.

కాగా, బుధవారం కర్ణాటకలో కొత్తగా 23,558 కరోనా కేసులు, 116 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు కర్ణాటకలో 12.22 లక్షల కరోనా కేసులు, 13762 మరణాలు సంభవించయ్యాయి. 

చదవండి: ఈ పరికరం కరోనా బాధితులకు ఓ వరం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top