బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 511 పోస్టులు

Bank of Baroda Recruitment 2021: Relationship Manager Pots, Find out Selection Process - Sakshi

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 29.04.2021

ముంబైలోని ప్రభుత్వరంగ బ్యాంక్‌.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. తన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ను బలోపేతం చేయడానికి సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్, ఈ–రిలేషన్‌షిప్‌ మేనేజర్, టెర్షరీ హెడ్, గ్రూప్‌ హెడ్, ప్రొడక్ట్‌ హెడ్‌–ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్, హెడ్‌–ఆపరేషన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డిజిటల్‌ సేల్స్‌ మేనేజర్, ఐటీ ఫంక్షనల్‌ అనలిస్ట్‌–మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్‌ 29వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

► మొత్తం పోస్టుల సంఖ్య: 511

పోస్టుల వివరాలు:     
► సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–407, ఈ–వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–50, టెర్షరీ హెడ్‌–44, గ్రూప్‌ హెడ్‌–06, ప్రొడక్ట్‌ హెడ్‌(ఇన్వెస్ట్‌మెంట్‌–రీసెర్చ్‌)–01, హెడ్‌(ఆపరేషన్స్‌ –టెక్నాలజీ)–01, డిజిటల్‌ సేల్స్‌ మేనేజర్‌–01, ఐటీ ఫంక్షనల్‌ అనలిస్ట్‌ మేనేజర్‌–01.

► సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ/నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 24–35ఏళ్ల మధ్య ఉండాలి.

► ఈ–వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 23–35ఏళ్ల మధ్య ఉండాలి.

► టెర్షరీ హెడ్‌: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి. స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ/నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 27–40ఏళ్ల మధ్య ఉండాలి.

► గ్రూప్‌ హెడ్‌: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 31–45 ఏళ్ల మధ్య ఉండాలి.

► ప్రొడక్ట్‌ హెడ్‌(ఇన్వెస్ట్‌మెంట్‌–రీసెర్చ్‌): అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 28–45ఏళ్ల మధ్య ఉండాలి.

► హెడ్‌(ఆపరేషన్స్‌–టెక్నాలజీ): అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణుల వ్వాలి. సంబంధిత పనిలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.

► డిజిటల్‌ సేల్స్‌ మేనేజర్‌: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 26–40 ఏళ్ల మధ్య ఉండాలి.

► ఐటీ ఫంక్షనల్‌ అనలిస్ట్‌ మేనేజర్‌: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంజనీరింగ్‌/సైన్స్‌/టెక్నాలజీ వారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 26–35 ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులను పర్సనల్‌ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌/ఇతర ఎంపిక ప్రక్రియకు పిలుస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 29.04.2021
► వెబ్‌సైట్‌: : www.bankofbaroda.co.in/careers.htm

ఏపీ, వాటర్‌ రిసోర్స్‌ విభాగంలో ఖాళీలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top