managerial jobs
-
ఎంట్రీలెవల్ ఉద్యోగాల్లో మహిళలు అంతంతే!
ముంబై: ప్రైవేటు రంగంలో ఎంట్రీలెవల్ (ఆరంభ స్థాయి) ఉద్యోగాలు, మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కడం లేదు. ప్రతి మూడు ఎంట్రీలెవల్ ఉద్యోగాల్లో ఒకే మహిళ ఉంటుంటే.. నిర్వహణ బాధ్యతల్లో మహిళల స్థానం 24 శాతంగా ఉన్నట్టు మెకిన్సే అండ్ కంపెనీ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. పట్టభద్రుల్లో సగం మంది మహిళలు ఉంటుంటే.. ప్రైవేటు సంఘటిత రంగంలో ఉద్యోగం పొందడం, ఉన్నత పదవులను అధిరోహించడం, వాటిని నిలుపుకునే విషయంలో వారు వ్యవస్థీకృత అడ్డంకులను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఆరంభ స్థాయి, మేనేజర్ ఉద్యోగాల్లో స్త్రీ–పురుష ఉద్యోగుల మధ్య ఉన్న అంతరాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. భారత్, నైజీరియా, కెన్యా వ్యాప్తంగా 324 సంస్థల ఉద్యోగ డేటాను మెకిన్సే అండ్ కంపెనీ విశ్లేషించింది. ఇందులో భారత్ నుంచి 77 ప్రైవేటు సంస్థల డేటా కూడా ఉంది. ఇక భారత్‌లో ఎంట్రీలెవల్ ఉద్యోగాల విషయంలో స్త్రీ–పురుషుల మధ్య వయసులోనూ అంతరం నెలకొన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. మహిళల సగటు వయసు 39 ఏళ్లుగా ఉంటే, పురుషుల వయసు 32 ఏళ్లుగా ఉంది. మెకిన్సే విశ్లేíÙంచిన అన్ని దేశాల్లోనూ ఈ వయసు అంతరం భారత్‌లోనే ఎక్కువగా ఉంది. దీని ఆధారంగా భారత్‌లో ఎక్కువ మంది మహిళలు ప్రైవేటు రంగంలో ఉపాధిని ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోందని ఈ నివేదిక పేర్కొంది. పదోన్నతులూ తక్కువే..పురుషులతో పోల్చి చూస్తే ఎంట్రీలెవల్ ఉద్యోగాల్లోని మహిళలకు పదోన్నతులు తక్కువగానే దక్కుతున్నాయి. స్త్రీలతో పోల్చి చూసినప్పుడు 2.4 రెట్లు అధికంగా పురుషులకు మేనేజర్ పదవులను అలంకరిస్తున్నారు. అంతేకాదు పురుషులతో పోల్చి చూస్తే మహిళలు 1.3 రెట్లు అధికంగా ఈ ఉద్యో గాలను వీడుతున్నారు. పెద్దగా పదోన్నతులు ఇవ్వకుండా, మహిళలను ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లోనే అట్టిపెట్టుకోవడం అన్నది వారి కెరీర్ పురోగతికి అవరోధమని ఈ నివేదిక పేర్కొంది. ‘‘పని ప్రదేశాల్లో లింగ సమానత్వం అన్నది నైతిక లేదా సామాజిక అవసరమే కాదు. ఇదొక వ్యూహాత్మకం కూడా. 2035 నాటికి భారత్ 8 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యం నేపథ్యంలో మహిళలను సంఘటిత రంగంలో పూర్తి స్థాయిలో మమేకం చేయడం అన్నది అభివృద్ధికి పు నాది అవుతుంది. చాలా సంస్థలు వైవిధ్యమైన నిర్వహణ, బృందాల ఆవశ్యకతను గుర్తించినప్పటికీ పురోగతి ఆశించిన మేర లేదు’’అని మెకిన్సే అండ్ కంపెనీ సీనియర్ పార్ట్నర్ వివేక్ పండిట్ తెలిపారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు
ముంబైలోని ప్రభుత్వరంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. తన వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్‌ను బలోపేతం చేయడానికి సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, ఈ–రిలేషన్షిప్ మేనేజర్, టెర్షరీ హెడ్, గ్రూప్ హెడ్, ప్రొడక్ట్ హెడ్–ఇన్వెస్ట్మెంట్ అండ్ రీసెర్చ్, హెడ్–ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ సేల్స్ మేనేజర్, ఐటీ ఫంక్షనల్ అనలిస్ట్–మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 29వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ► మొత్తం పోస్టుల సంఖ్య: 511 పోస్టుల వివరాలు: ► సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్–407, ఈ–వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్–50, టెర్షరీ హెడ్–44, గ్రూప్ హెడ్–06, ప్రొడక్ట్ హెడ్(ఇన్వెస్ట్మెంట్–రీసెర్చ్)–01, హెడ్(ఆపరేషన్స్ –టెక్నాలజీ)–01, డిజిటల్ సేల్స్ మేనేజర్–01, ఐటీ ఫంక్షనల్ అనలిస్ట్ మేనేజర్–01. ► సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్: అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ/నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 24–35ఏళ్ల మధ్య ఉండాలి. ► ఈ–వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 23–35ఏళ్ల మధ్య ఉండాలి. ► టెర్షరీ హెడ్: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి. స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ/నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 27–40ఏళ్ల మధ్య ఉండాలి. ► గ్రూప్ హెడ్: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 31–45 ఏళ్ల మధ్య ఉండాలి. ► ప్రొడక్ట్ హెడ్(ఇన్వెస్ట్మెంట్–రీసెర్చ్): అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 28–45ఏళ్ల మధ్య ఉండాలి. ► హెడ్(ఆపరేషన్స్–టెక్నాలజీ): అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణుల వ్వాలి. సంబంధిత పనిలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. ► డిజిటల్ సేల్స్ మేనేజర్: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 26–40 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఐటీ ఫంక్షనల్ అనలిస్ట్ మేనేజర్: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంజనీరింగ్/సైన్స్/టెక్నాలజీ వారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 26–35 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్/ఇతర ఎంపిక ప్రక్రియకు పిలుస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.04.2021 ► వెబ్సైట్: : www.bankofbaroda.co.in/careers.htm ఏపీ, వాటర్ రిసోర్స్ విభాగంలో ఖాళీలు -
తరచూ మద్యం సేవించేది వారే..
లండన్ : సమాజంలో గౌరవప్రదమైన వృత్తుల్లో ఉంటూ అధిక రాబడి పొందే వారే ఎక్కువగా మద్యం సేవిస్తారని తాజా అథ్యయనం వెల్లడించింది. బ్రిటన్‌లో ఇతరులతో పోలిస్తే వైద్యులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు తరచూ మద్యం తీసుకుంటారని తేలింది. మేనేజ్మెంట్, ప్రొఫెషనల్ బాధ్యతల్లో ఉన్న ప్రతి ఐదుగురిలో నలుగురు ఆల్కహాల్ తీసుకుంటారని అంచనా వేసింది. ఇక ఈ అలవాటు కార్మికులు, లారీ డ్రైవర్లు, రిసెప్షనిస్టులు, కేర్ వర్కర్లు ఇతరుల్లో కేవలం సగానికే పరిమితమని పేర్కొంది. అయితే మద్యం మితిమీరి తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ర్పభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి నుంచి బయటపడేందుకు మిడిల్ క్లాస్ ప్రొఫెషనల్స్ మద్యానికి దాసోహం అవుతుండటం పెచ్చుమీరుతోందని ఆల్కహాల్ ఎడిక్షన్ నిపుణుడు స్టీవ్ క్లార్క్ ఆందోళన వ్యక్తం చేశారు. పనిఒత్తిడిని అధిగమించేందుకు వారు తమకు తామే మద్యాన్ని మెడిసిన్‌లా వాడుతున్నారని తాము గుర్తించామన్నారు. యూకేలో మద్యం అలవాట్లపై ప్రచురితమైన నివేదిక ఈ ధోరణులకు అద్దం పట్టింది. బ్రిటన్‌లో దాదాపు 60 శాతం మంది పెద్దలు మద్యాన్ని సేవిస్తున్నట్టు తేలింది. అతిగా మద్యం సేవించడం కారణంగా మరణాల సంఖ్య ఈ దశాబ్ధంలో పది శాతం మేర పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. -
టాటా మోటార్స్ షాక్: 1500 మేనేజర్లపై వేటు
-
టాటా మోటార్స్ షాక్: 1500 మేనేజర్లపై వేటు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స షాకింగ్ న్యూస్ చెప్పింది. తన వర్క్‌ఫోర్స్ లో టాప్ ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. మేనేజర్ స్థాయిలో దాదాపు 1500 మంది ఉద్యోగులనుతొలగించనున్నట్టు బుధవారం ప్రకటించింది. దేశీయంగా సంస్థ పునర్నిర్మాణంలో భాగంగాఈ కోతలని తెలిపింది. వైట్ కాలర్ ఉద్యోగులకు సంబంధించి 10-12 శాతం (సుమారు1500)మందిని తొలగిస్తున్నట్టు టాటా మోటార్స్ ఎండీ, సీఈవో గుంటెర్ బుచ్చక్ ప్రకటించారు. టాటా మోటార్స్ వార్షిక ఫలితాల సందర్భంగా ఆయన వివరాలను తెలిపారు. అలాగే బ్లూకాలర్ ఉద్యోగుల్లోఎలాంటి తొలగింపులులేవని స్పష్టం చేశారు. అయితే పనితీరు మరియు నాయకత్వ లక్షణాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నామని కంపెనీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సి రామకృష్ణన్ తెలిపారు. ఇది నిర్వహణ ఖర్చుల తగ్గింపులో భాగ కాదని వివరణ ఇచ్చారు. వీరిలో కొంతమంది స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ఎంచుకున్నారనీ, మరికొంతమందిని ఇతర విభాగాలను బదిలీ చేసినట్టు చెప్పారు. కాగా 2016-17 క్యూ4లో టాటా మోటార్స్ బ్రిటిష్ అనుబంధ సంస్థ జేఎల్ఆర్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి-మార్చి)లో జేఎల్ఆర్ నికర లాభం 18 శాతం ఎగసి 55.7 కోట్ల పౌండ్లను తాకగా.. మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని 726.8 కోట్ల పౌండ్లకు చేరింది. టాటా మోటార్స్ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 17 శాతం క్షీణించి రూ. 4296 కోట్లను, మొత్తం ఆదాయం 3 శాతం తగ్గి రూ. 78,747 కోట్లను తాకింది.ఈ నేపథ్యంలో ఒడిదుడుల మార్కెట్లో టాటా మోటార్స్ షేరు భారీ లాభాలతో టాప్ విన్నర్ గా నిలిచింది.