సామ్రాజ్య భారతి 1886/1947

Azadi Ka Amrit Mahotsav: Samrajya Bharati 1886/1947 - Sakshi

ఘట్టాలు
1824 తరువాత సంభవించిన మూడు వరుస యుద్ధాల అనంతరం బర్మా దేశం బ్రిటిష్‌ సామ్రాజ్య కాలనీ రాజ్యంగా మారింది. బ్రిటిష్‌ పాలన ఆ దేశంలో సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, పాలనా పరమైన మార్పులను తీసుకు వచ్చింది. 1948 లో బర్మాకు బ్రిటన్‌ నుంచి విముక్తి లభించింది. 

చట్టాలు
ఇండియన్‌ ట్రామ్‌వేస్‌ యాక్ట్, బర్త్స్, డెత్స్‌ అండ్‌ మ్యారేజన్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ , మెడికల్‌ యాక్ట్‌

జననాలు
రాస్‌ బెహారీ బోస్‌ : స్వాతంత్య్ర సమర పోరాట యోధుడు (పశ్చిమ బెంగాల్‌); చెంగనూర్‌ రామన్‌ పిళ్లై : కథాకళి ఆర్టిస్ట్‌ (ట్రావెంకోర్‌); మైథిలీ శరణ్‌ గుప్తా : హిందీ కవి (ఉత్తర ప్రదేశ్‌); రాధాబినోద్‌ పాల్‌ : న్యాయ కోవిదుడు (పూర్వపు బంగ్లాదేశ్‌); ఆర్దేశిర్‌ ఇరానీ : సకల కళా సినీరంగ ప్రవీణులు – దర్శకుడు, నిర్మాత, నటుడు, రచయిత, ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్, సినిమాటోగ్రాఫర్‌ (పుణె); జాన్‌ మతాయ్‌ : ఆర్థికవేత్త, భారతదేశ తొలి రైల్వే మినిస్టర్‌ (కేరళ); ఉస్మాన్‌ అలీ ఖాన్, అసఫ్‌ జా 7 : నిజాం అసఫ్‌ జాహీ పాలకులలో చివరివారు (హైదరాబాద్‌); రాజ మహేంద్ర ప్రతాప్‌ : స్వాతంత్య్ర సమర యోధులు, ప్రొవెన్షియల్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ (ఉత్తరప్రదేశ్‌); కె.పి. కేశవ మీనన్‌ : దేశభక్తులు, స్వాతంత్య్ర సమర యోధులు, సిద్ధాంతకర్త (కేరళ); కేశవరావ్‌ జెధె : స్వాతంత్య్ర సమరయోధులు, కాంగ్రెస్‌ నేత (బాంబే ప్రెసిడెన్సీ).
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top