కరోనా : విషమంగా కేంద్రమంత్రి ఆరోగ్యం | Ayush Minister Shripad Naik Health Condition Serious | Sakshi
Sakshi News home page

కరోనా : విషమంగా కేంద్రమంత్రి ఆరోగ్యం

Aug 24 2020 5:50 PM | Updated on Aug 24 2020 6:15 PM

 Ayush Minister Shripad Naik Health Condition Serious - Sakshi

పనాజీ : కరోనా బారిన పడిన కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత 10 రోజులుగా మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు సోమవారం ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో వైద్యుల సూచనల మేరకు ఢిల్లీ ఎయిమ్స్‌ నుంచి గోవాకు ప్రత్యేక వైద్య బృందం పయనమైంది. ఈ మేరకు శ్రీపాద నాయక్‌ ఆరోగ్య పరిస్థితిపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావాంత్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా ఈ నెల 12వ తేదీన కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద నాయక్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. (భారత్‌లో ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement