IVF ద్వారా పుట్టిన తొలి దూడ.. ఇకపై ఏం జరగనుందంటే? | First Lakhimi Calf Born Through IVF In Assam, Marking A Major Milestone For Indigenous Cattle, Check Post Inside | Sakshi
Sakshi News home page

IVF ద్వారా పుట్టిన తొలి దూడ.. ఇకపై ఏం జరగనుందంటే?

Aug 23 2026 6:42 PM | Updated on Aug 23 2026 6:56 PM

  Assam Welcomes First IVF Born Calf
  • దేశీయ పశు జాతి సంరక్షణలో కొత్త అధ్యాయం

అస్సాంలో దేశీయ లక్ష్మీ పశు జాతికి చెందిన ఆడ దూడ ఇన్‌-విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) ద్వారా జన్మించింది. ఈ జాతిలో ఐవీఎఫ్‌ ద్వారా దూడ పుట్టడం ఇదే తొలిసారిగా పేర్కొంటున్నారు. అస్సాం వెటర్నరీ అండ్‌ ఫిషరీ యూనివర్సిటీలో ఈ దూడ జన్మించింది. అస్సాంలో దేశీయ పశువుల కోసం సహాయక పునరుత్పత్తి సాంకేతికత వినియోగంలో ఇది ముందడుగుగా నిలిచింది.

ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. ఈ విజయాన్ని ఆయన “సభ్యత, సంస్కృతి, సృజనల అందమైన సమ్మేళనం”గా అభివర్ణించారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు, పశువైద్య నిపుణులకు అభినందనలు తెలిపారు. 

 

“అస్సాంకు చెందిన దేశీయ లక్ష్మీ జాతిలో ప్రపంచంలోనే తొలి ఐవీఎఫ్‌ ఆడ దూడ అసోం వెటర్నరీ అండ్‌ ఫిషరీ యూనివర్సిటీలో జన్మించింది. ఈ చరిత్రాత్మక విజయం మన పశుసంపద, పాల రంగానికి కొత్త అవకాశాలను తెరుస్తుంది. దేశీయ జాతులను సంరక్షించడం, వ్యాధుల నియంత్రణను మెరుగుపరచడం, పాల ఉత్పాదకతను పెంచడం, చివరకు రైతుల ఆదాయాలను పెంచడం వంటి అంశాల్లో ఇది కీలకంగా మారుతుంది” అని అన్నారు.

లక్ష్మీ పశు జాతి అస్సాంకు చెందిన దేశీయ పశు జాతి. ఇది రాష్ట్రంలోని స్థానిక పశుసంపదలో భాగంగా ఉంది. శాస్త్రవేత్తలు కోరుకున్న లక్షణాలు ఉన్న పశువుల సంఖ్యను పెంచడంతో పాటు దేశీయ జాతుల సంరక్షణకు ఐవీఎఫ్‌ వంటి పునరుత్పత్తి సాంకేతికతలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ విజయంపై ముఖ్యమంత్రి శాస్త్రవేత్తకు అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి: ప్రపంచం ముందు భారత్‌ తలెత్తుకు నిలబడేలా.. 4 నెలల్లో..

“ఇది చిన్న దూడ కావచ్చు. కానీ మన రాష్ట్ర బయోటెక్నాలజీ రంగంలో ఆమె ఒక గొప్ప మైలురాయిని మోస్తోంది” అని శర్మ అన్నారు. అస్సాంలోని దేశీయ పశు జాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం ఆధునిక పునరుత్పత్తి సాంకేతికతను ఉపయోగించే దిశగా ఈ దూడ జననం ఒక ముందడుగుగా భావిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement