కోళీకోడ్‌ ఘటనపై స్పందించిన అశోక్‌ గజపతి రాజు

Ashok Gajapathi Raju Above Kozhikode Flight Accident - Sakshi

న్యూఢిల్లీ: కేరళ కోళీకోడ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన విమాన ప్రమాద ఘటనపై మాజీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు స్పందించారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి అన్నారు. భద్రత చాల ముఖ్యమని తెలిపారు. కోళీకోడ్‌ ఎయిర్‌ పోర్టుకు రన్ వే ఎక్స్‌టెన్షన్ అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద విమానాలు దిగేందుకు ఎక్స్‌టెన్షన్‌ తప్పనిసరి అన్నారు. (విమాన ప్రమాదానికి కారణం ఇదేనా!)

అయితే రన్ వేను ఎక్స్‌టెన్షన్ చేశారా.. లేదా అన్న విషయం తనకు తెలియదు అన్నారు అశోక్‌ గజపతిరాజు. ఎయిర్ పోర్టు, ఎయిర్‌క్రాఫ్ట్‌ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది తేలాలి అన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌(డీజీసీఏ) నివేదికలోనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు అశోక్‌ గజపతిరాజు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top