బోయిమ్, అవ్వాద్‌లకు ఇందిరా గాంధీ శాంతి బహుమతి | Sakshi
Sakshi News home page

బోయిమ్, అవ్వాద్‌లకు ఇందిరా గాంధీ శాంతి బహుమతి

Published Fri, Dec 15 2023 6:28 AM

Activist Ali Abu Awwad and pianist Daniel Barenboim win Indira Gandhi Peace Prize - Sakshi

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌–పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనడంలో కృషి సాగిస్తున్న డేనియల్‌ బరెన్‌బోయిమ్, అలీ అబు అవ్వాద్‌లకు 2023 సంవత్సరం ఇందిరా గాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు. అర్జెంటినాలో జని్మంచిన సంగీత కళాకారుడు బరెన్‌బోయిమ్, పాలస్తీనాకు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు.

వీరిద్దరికీ కలిపి సంయుక్తంగా ఇందిరాగాంధీ శాంతి, నిరాయు«దీకరణ, సామాజికాభివృద్ధి బహుమతిని ప్రదానం చేసినట్లు కమిటీ జ్యూరీ చైర్మన్‌ మాజీ ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ చెప్పారు. వీరిద్దరూ మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు కృషి సాగిస్తున్నారని ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌ ప్రశంసించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement