ఐదుగురితో ప్రేమ.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన బాయ్‌ఫ్రెండ్‌.. కానీ!

5 Girls Fight Over Boyfriend At Bihar Sonpur Mela Viral Video - Sakshi

పట్నా: ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకున్న సంఘటనలు చూసే ఉంటారు. అలాంటిది ఒక అబ్బాయి కోసం ఏకంగా ఐదుగురు అమ్మాయిలు జుట్టు పట్టుకుని కొట్టుకోవటం ఎప్పుడైనా చూశారా? అలాంటి అరుదైన సంఘటనే బిహార్‌లో జరిగింది. సోన్‌పుర్‌ మేళలో బాయ్‌ఫ్రెండ్‌ కోసం ఐదుగురు అమ్మాయిలు గొడవ పడ్డారు. జట్టుపట్టుకుని చితక్కొట్టుకున్నారు. చుట్టూ వందల మంది ఉన్నా.. చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఈ ఫైటింగ్‌ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇంతకీ బాయ్‌ఫ్రెండ్‌ని వదిలేసి వారు కొట్టుకోవటానికి కారణాలేంటి?

సోన్‌పుర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఒకేసారి ఐదుగురితో ప్రేమ వ్యవహారాన్ని నడిపించాడు. ఏ ఒక్కరికి అనుమానం రాకుండా ఇన్నాళ్లు చూసుకున్నాడు. అయితే, ఆ ఐదుగురు అమ్మాయిల్లో ఒకరితో సోన్‌పుర్‌లో జరుగుతున్న ‘మేళ’కు రావటమే అతడు చేసిన తప్పు. అదే మేళకు మిగిలిన నలుగురు అమ్మాయిలు రావటంతో రెడ్‌హ్యాండేడ్‌గా దొరికిపోయాడు. కానీ, ఆ యువకుడి కోసం అమ్మాయిలు గొడవకు దిగటమే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే, నలుగురు అమ్మాయిలు కలిసి ఆ యువకుడితో వచ్చిన యువతిని చితకబాదారు. ఆ యువకుడు ఆమెను కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఓ అమ్మాయి కాలితో తన్నుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది సేపటి తర్వాత అక్కడే ఉన్న కొంత మంది కలుగజేసుకుని గొడవను ఆపారు. 

ఇదీ చదవండి: షాకింగ్‌ ఘటన.. పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top