చికెన్‌ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత | 12 Hospitalised After Eating Chicken Shawarma In Mumbai | Sakshi
Sakshi News home page

చికెన్‌ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత

Apr 29 2024 1:07 PM | Updated on Apr 29 2024 1:07 PM

12 Hospitalised After Eating Chicken Shawarma In Mumbai

ముంబై: చికెన్‌ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌ జరిగి రెండు  ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.

బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్‌ ప్రాంతంలోని సంతోష్‌ నగర్‌లో శాటిలైట్‌ టవర్‌ వద్ద చికెన్‌ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు.  వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.  

వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement