ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలని మోదీకి లేఖ! | 100 Former Bureaucrats Write To PM Modi End Politics Of Hate | Sakshi
Sakshi News home page

ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ మోదీకి లేఖ

Apr 27 2022 12:30 PM | Updated on Apr 27 2022 12:45 PM

100 Former Bureaucrats Write To PM Modi End Politics Of Hate - Sakshi

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మత హింస కేసులపై 100 మందికి పైగా మాజీ బ్యూరోక్రాట్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో వారు..."దేశంలోని రాజకీయ పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ద్వేషపూరిత రాజకీయాలకు' స్వస్తి పలకాలని కోరారు.  తాము అతి పెద్ద సామాజికి ముప్పును ఎదుర్కుటున్నాం అని, ఇది కేవలం రాజ్యంగ నైతికత, ప్రవర్తనకు సంబంధించినది మాత్రమే కాదని ఆ లేఖలో స్పష్టం చేశారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే మీ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఏడాది 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో, పక్షపాత ధోరణికి అతీతంగా వ్యవహరించాలని తాము ఆశిస్తున్నాం.

మీ పార్టీ నియంత్రణలో ఉన్న ప్రభుత్వాలు చాలా పట్టుదలతో ద్వేషపూరిత రాజకీయాలకు ముగింపు పలకడానికి కృషి చేస్తున్నాయి. అంతేకాదు మన వ్యవస్థాపక పితామహులు సృష్టించిన రాజ్యాంగ విధానాన్ని నాశనం చేసేలా పరిస్థితి తలెత్తడంతోనే తమ ఆవేదనను, భావనను, వ్యక్తికరీంచేలా ఈ లేఖ రాసేందకు పురికొల్పిందన్నారు. బీజెపీ పాలిత రాష్ట్రాల్లోని ముస్లింలు మతపరమైన ద్వేషానికి ఎక్కువగా గురవుతున్నారని ఆరోపణలు కూడా చేశారు.

అంతేకాదు అధికారంలో ఉన్న బీజేపీ శాంతి, సామరస్యాన్ని కాపాడే సాధనంగా కాకుండా, మైనారిటీలను నిత్యం భయాందోళనకు గురిచేసే సాధనంగా మారిందన్నారు." ఈ మేరకు  మాజీ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్, మాజీ హోం కార్యదర్శి జీకే పిళ్లై, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకేఏ నాయర్‌తో సహా 108 మంది ఆ లేఖపై సంతకాలు చేశారు.

(చదవండి: అక్కడ గెలుపే టార్గెట్‌.. బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement