గుట్టకాయ స్వాహా! | - | Sakshi
Sakshi News home page

గుట్టకాయ స్వాహా!

Sep 29 2026 12:57 AM | Updated on Sep 29 2026 12:57 AM

చర్యలు తీసుకుంటాం..

–8లో u

మరికల్‌: జిల్లాలోని మట్టి మాఫియా గుట్టలను కొల్లగొడుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వకాలు నిర్వహిస్తూ.. ప్రకృతి సంపదను కనుమరుగు చేస్తోంది. వివిధ ప్రాంతాలకు మట్టి అక్రమ రవాణాతో సొమ్ము చేసుకుంటోంది. మరికొన్ని ప్రాంతాల్లో గుట్టలతో పాటు చెరువులు, కుంటలను కూడా వదలడం లేదు. రోడ్డు మార్గాన ట్రాక్టర్లు, టిప్పర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నప్పటికీ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అందుకు కారణాలు అనేకమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అనుమతులు ఒకచోట పొందితే.. మరో చోట మట్టి తవ్వి తరలిస్తున్నారు. ఇందుకు అధికారులు వత్తాసు పలకడం విస్మయానికి గురిచేస్తోంది.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

ప్రభుత్వ, ప్రైవేటు పనులకు మట్టి కావాల్సి వస్తే, నిబంధనల ప్రకారం టన్నుకు రూ.56 చొప్పున మైనింగ్‌ శాఖకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎంతమేర కావాలో పేర్కొంటూ ఆ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత మైనింగ్‌శాఖ డీడీఓ కోడ్‌ పేరిట చలానా తీయాలి. ఈ మేరకు నిర్దేశిత సర్వే నంబర్‌లో చలానా చెల్లించిన మేరకు అధికారులు కొలతలు (పొడవు, వెడల్పు, లోతు) వేసి అనుమతి పత్రాలు ఇస్తారు. ఆ తర్వాతే తవ్వకాలు చేపట్టి, మట్టి తరలించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఒకరిద్దరు మినహా అక్రమార్కులు నిబంధనలను తుంగలో తొక్కి దందా సాగిస్తున్నారు. రాయల్టీ ఎగవేస్తూ.. యథేచ్ఛగా గుట్టలను కొల్లగొడుతున్నారు. దీంతో పర్యావరణంపై ప్రభావం పడుతుండటంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.

అనుమతులు లేకుండా గుట్టల నుంచి ఎర్రమట్టిని తరలించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారం రాయల్టీ చెల్లించి మట్టిని తవ్వాలి. అలా కాకుండా అడ్డదారిలో మట్టిని తరలించే వారిపై నిఘా ఉంచి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

– సత్యనారాయణ, ఏడీ, మైనింగ్‌శాఖ

జిల్లాలో చెలరేగిపోతున్న మట్టి మాఫియా

రాత్రి, పగలు తేడా లేకుండా

గుట్టల్లో తవ్వకాలు

మట్టి రవాణాతో అక్రమార్జన

కనుమరుగవుతున్న ప్రకృతి సంపద

కొరవడిన అధికారుల నిఘా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement