● మద్దూరులో పరిహారం
ప్రకటించకుండానే కూల్చివేతలు
● ఆందోళనకు దిగిన బీఆర్‌ఎస్ నాయకులు
కొత్తపల్లి: మద్దూరు మున్సిపాలిటీలో చేపట్టిన రోడ్డు విస్తరణ ఉద్రిక్తతకు దారితీసింది. బాధితులకు పరిహారం ప్రకటించకుండానే కూల్చివేతలు ప్రారంభించడంతో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. మద్దూరు పాతబస్టాండ్ చౌరస్తా నుంచి చింతల్‌దిన్నె రోడ్డులో నిర్మిస్తున్న గురుకుల పాఠశాల వరకు 70 ఫీట్ల మేర రోడ్డు విస్తరణకు ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. ఈ రోడ్డు విస్తరణతో 84మంది వ్యాపార దుకాణాలు, నివాసగృహాలను కోల్పోతున్నారు. 50 ఫీట్లతో రోడ్డు నిర్మించాలని పలుమార్లు పాలకులు, ఉన్నతాధికారులకు విన్నవించారు. ఎట్టకేలకు 60 ఫీట్ల వెడల్పుతో త్వరగా పనులు ప్రారంభించాలని స్థానిక అధికారులకు ఆదేశాలు రావడంతో సోమవారం ఉదయం పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు నర్సింహ, దినేష్, సంగీత శివకుమార్, గోపాల్, మౌలానా, నాయకులు అంజయ్య, భీంసేన్ అక్కడికి చేరుకొని బాధితులకు ఎలాంటి పరిహారం ప్రకటించకుండానే ఎలా కూల్చివేస్తారని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పంచాయతీరాజ్ ఈఈ అశోక్, డీఈ అంజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్‌తో వారు వాగ్వాదానికి దిగారు. రోడ్డు విస్తరణతో నష్టపోతున్న బాధితులకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అయితే బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై ఆగ్రహించిన నాయకులు.. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్ర యత్నించగా, పోలీసులు వారిని అరెస్టు చేసి నారాయణపేట, మద్దూరు స్టేషన్లకు తరలించారు. పోలీ సు పహారా మధ్య కూల్చివేతలు చేపట్టారు.
0000724107-000001-SVS HOSPITAL
8.00x8.00
SVS HOSPITAL


