సీఈసీ రాజీనామా చేయాలి : కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

సీఈసీ రాజీనామా చేయాలి : కాంగ్రెస్‌

Sep 29 2026 12:57 AM | Updated on Sep 29 2026 12:57 AM

నారాయణపేట/కోస్గి రూరల్‌: ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం కోస్గి పట్టణంలోని శివాజీ చౌరస్తాలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మ దహనం చేశారు. అదే విధంగా కలెక్టరేట్‌లో ఏఓను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. దేశ పౌరులకు ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును హరించే విధంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. సర్‌ ప్రక్రియలో కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు – పునరుద్ధరణ, ఎన్నికల డేటా నిర్వహణ తదితర అంశాలపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించినట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఓటరుకు అభ్యంతరం తెలిపే అవకాశం, పేరు సరిచేసుకునే సమర్థవంతమైన ప్రక్రియ కల్పి ంచాలని కోరారు. ఎన్నికల సంఘం వ్యవహారాలపై పూర్తి పారదర్శక విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయకుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ సలీం, అధికార ప్రతినిధి వి.సంతోష్‌కుమార్‌, మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ నాగులపల్లి నరేందర్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ గౌస్‌, శ్రీనివాస్‌రెడ్డి, విజయ్‌గౌడ్‌, కృష్ణారెడ్డి, అన్న కిష్టప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement