అందరి సహకారంతో ఉత్సవాలు ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

అందరి సహకారంతో ఉత్సవాలు ప్రశాంతం

Sep 29 2026 12:57 AM | Updated on Sep 29 2026 12:57 AM

నారాయణపేట: ప్రజల సహకారం, పోలీసుల స మన్వయంతో గణేశ్‌ నవ రాత్రి ఉత్సవాలు, తాఖీబాబా దర్గా ఉర్సు ప్ర శాంతంగా ముగిశాయని ఎస్పీ డా.వినీత్‌ సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. వేడుకల సందర్భంగా ఉత్స వ కమిటీలు, మత పెద్దలు, హిందూ–ముస్లిం పీస్‌ కమిటీలు, ప్రజాప్రతినిధులు, యువత సమన్వయంతో వ్యవహరించారని పేర్కొన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా పోలీసుశాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టి.. సీసీ కెమెరాలు, డ్రోన్‌, వీడియో రికార్డింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, రూట్‌ భద్రత వంటి చర్య లతో నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించినట్లు తెలిపారు. విధుల్లో భాగస్వాములైన పోలీసు అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.ఉత్సవాల సందర్భంగా ప్రజ లు పరస్పర గౌరవం, సోదరభావంతో వ్యవ హరించడం శాంతి సామరస్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ప్రశాంతంగా ఉత్సవాల నిర్వ హణకు సహకరించిన ప్రజలు, నిర్వాహకులు, మత పెద్దలు, పీస్‌ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువత, మీడియా ప్రతినిధులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కళాశాలలకు పక్కా

భవనాలు నిర్మించాలి

నారాయణపేట ఎడ్యుకేషన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలకు పక్కా భవనాలు నిర్మించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర్‌ కిరణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక వివేకానంద పార్కు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు భానుప్రసాద్‌ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ముందుగా భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కిరణ్‌ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనం శిథిలావస్థకు చేరడంతో చాలా మంది విద్యార్థులు అడ్మిషన్‌ కాకుండా ప్రైవేటు కళాశాలల వైపు వెళ్తున్నారన్నారు. అదే విధంగా మంచినీరు, మూత్రశాలలు సరిగ్గా లేకపోవడం, కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరగడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైతం ఇదే తీరు ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా నూతన భవనాలు నిర్మించి, విద్యార్థుల కష్టాలు తీర్చాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నరహరి, పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement