ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సర్దుబాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది సర్దుబాటులో వెళ్లిన ఉపాధ్యాయులు అక్కడే ఉండాలని ఆదేశిస్తూ, జరిగిన అడ్మిషన్ల ఆధారంగా మిగులు (సర్‌ప్లస్) ఉన్న ఉపాధ్యాయులను బదిలీలు చేయాలని సూచించింది. ఈనెల చివరి వరకు పలువురు ఉపాధ్యాయులు రిటైర్డ్ కానున్న నేపథ్యంలో.. ఆ తర్వాత సర్దుబాటు చేయాలని యోచిస్తున్నాం.
– విజయకుమారి, డీఈఓ మహబూబ్‌నగర్
ప్రభుత్వం సర్దుబాటు చేయడం అంటే విద్యార్థులు లేని పాఠశాలలను మూసివేయడమే. ఆ పాఠశాలలను మూసి వేయకుండా చర్యలు తీసుకోవాలి. కేవలం ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల్లో మాత్రమే బదిలీలు చేయాలి. సర్దుబాటులో పూర్తిస్థాయిలో పారదర్శకంగా ఎలాంటి పైరవీలకు తావులేకుండా బదిలీలు చేస్తే ఉపాధ్యాయులు ఇబ్బందులు లేకుండా ఉంటుంది.
– మదన్‌మోహన్, పీఆర్టీయూ
జిల్లా అధ్యక్షుడు, మహబూబ్‌నగర్
●


