మధ్యాహ్న భోజనం.. మరింత నాణ్యత | - | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనం.. మరింత నాణ్యత

Jun 18 2026 1:23 AM | Updated on Jun 18 2026 1:23 AM

నిబంధనలు పాటిస్తాం..

వంట ఏజెన్సీ కార్మికులు, ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ

పోషకాహారం అందించే దిశగా అడుగులు

స్వచ్ఛతపై ప్రత్యేక అవగాహన

గతేడాది సమస్యలు పునరావృతం

కాకుండా పకడ్బందీ చర్యలు

–8లో u

మరికల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యతగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది జరిగిన తప్పులను సవరించి కొత్త విద్యా సంవత్సరంలో నాణ్యత ప్రమాణాలు, జాగ్రత్తలు పాటించేలా.. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా వంట ఏజెన్సీ కార్మికులకు, ఒక కాంప్లెక్స్‌ ఉపాధ్యాయుడికి జిల్లాలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో మండలానికి ఇద్దరికి శిక్షణ పూర్తికాగా.. మిగతా వారికి అవగాహన కల్పిస్తున్నారు.

మార్గదర్శకాలు జారీ..

ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకంలో ఏటా మార్పులు తీసుకొస్తోంది ప్రభుత్వం. కోడిగుడ్లు, ఆకుకూరలు, పోషకాలతో కూడిన కిచిడీ, రాగిజావ వంటివి అందిస్తున్నారు. ఈ నెల 15న పాఠశాలలు పునః ప్రారంభం కాగా.. అప్పటికే వంట పాత్రలు, గదులు శుభ్రం చేయడంతో పాటు మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించకుండా ఉండేందుకు హెచ్‌ఎంలు, వంట ఏజెన్సీల మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు.

మధ్యాహ్న భోజనం నాణ్యత ప్రమాణాల విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తాం. జిల్లాలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే పాఠశాలల ప్రారంభానికి ముందే వంట పాత్రలు కూడా శుభ్రం చేయించాం. – యాదయ్య శెట్టి,

మధ్యాహ్న భోజన ఇన్‌చార్జ్‌, నారాయణపేట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement