ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం కావాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం కావాలి

Jun 18 2026 1:23 AM | Updated on Jun 18 2026 1:23 AM

నిర్మాణ పనులు

వేగంగా పూర్తి చేయాలి..

నారాయణపేట: జిల్లాలో డయేరియా నిర్మూలన, పల్స్‌ పోలియో, జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమాలను సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెనన్స్‌ హాల్‌లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. జిల్లా వైద్యాధికారి డా. జయచంద్ర మోహన్‌, జిల్లా ప్రోగ్రాం అధికారి డా. సాయిరాం ఆయా కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. డయేరియా నివారణలో భాగంగా జూన్‌న్‌ 28 నుంచి 30 వరకు ఐదేళ్లలోపు పిల్లలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, జింక్‌ మాత్రలు అందజేయనున్నట్లు తెలిపారు. వాంతులు, విరేచనాలతో బాధపడే పిల్లలకు వెంటనే ఓఆర్‌ఎస్‌, జింక్‌ చికిత్స అందిస్తామని చెప్పారు. పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఐదేళ్లలోపు ఉన్న 53,667 మంది చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 72 వేల వ్యాక్సిన్‌న్‌ డోసులు జిల్లాకు అందాయని చెప్పారు. జూనన్‌ 28న పోలియో బూత్‌లలో చుక్కలు వేయగా.. 29, 30 తేదీల్లో మిగిలిన పిల్లలకు ఇంటింటికి వెళ్లి వేస్తామని వివరించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 1 నుంచి 19 ఏళ్లలోపు వయస్సున్న వారికి ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలకు దూరం కాకుండా చూడాలని ఆదేశించారు. అలాగే ప్రతి పోలియో బూత్‌లో ఓఆర్‌ఎస్‌ కార్నర్‌ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. సిద్ధప్ప, ప్రోగ్రాం అధికారులు సత్యప్రకాశ్‌, బిక్షపతి, జీఎంసీ ప్రిన్సిపాల్‌ డా. సంపత్‌కుమార్‌ సింగ్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి సుదర్శన్‌రావు, ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌న్‌ అధ్యక్షుడు సుదర్శన్‌్‌రెడ్డి, అబ్దుల్‌ ఖదీర్‌ తదితరులు పాల్గొన్నారు.

కోస్గి రూరల్‌: స్థానిక పురపాలికలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని.. నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అధికారులను ఆదేశించారు. టీయూఎఫ్‌ఐడీసీ, కడా ప్రత్యేక నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను బుధవారం కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డితో కలిసి పరిశీలించారు. పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి కాల్వలు, ప్రధాన అనుసంధాన రహదారులు, అంతర్గత సీసీ రహదారులు, నీటి సరఫరా వ్యవస్థ, సైన్స్‌ మ్యూజియం, డంపింగ్‌యార్డ్‌ ప్రధాన అనుసంధాన రోడ్లు, శంభుని ఆలయం తదితర అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శంభుని ఆలయం వద్ద నిర్మిస్తున్న కల్వర్టు, ఆలయం చుట్టూ ఉన్న భూమి కబ్జాకి గురైందని.. సర్వే చేయించాలని మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌ కలెక్టర్‌ను కోరగా సర్వేకు తహసీల్దార్‌ బక్క శ్రీనివాస్‌ను ఆదేశించారు. కోస్గి మండలంలోని నాచారం, తోగాపూర్‌ నుంచి వెళ్లే రేడియల్‌ రోడ్‌ మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం కోస్గిలోని సామాజిక కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసీజీ, డిజిటల్‌ ఎక్స్‌రే, ల్యాబ్‌, లేబర్‌రూంను పరిశీలించారు. ఆమెవెంట హౌసింగ్‌ పీడీ శంకర్‌ నాయక్‌, పుర కమిషనర్‌ నాగరాజు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ శ్రీధర్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement