కాంగ్రెస్‌ పార్టీ బలోపేతమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతమే లక్ష్యం

Jun 18 2026 1:23 AM | Updated on Jun 18 2026 1:23 AM

నారాయణపేట: కాంగ్రెస్‌పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ)ని ఏర్పాటు చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సీవీఆర్‌ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి, అసెంబ్లీ ని యోజకవర్గ ఇన్‌న్‌చార్జ్‌లు తిరుపతిరెడ్డి, కుంభం శివకుమార్‌రెడ్డి సూచనతో కార్యవర్గాన్ని రూపొందించినట్లు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న సీనియర్‌ నాయకులు, యువత, మహిళ లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సముచిత స్థానం కల్పించినట్లు పేర్కొన్నారు. నూతన కమిటీలో ఆరుగురు జిల్లా ఉపాధ్యక్షులు, 12 మంది ప్రధాన కార్యదర్శులు, 20 మంది కార్యదర్శులు, ఒక కోశాధికారి, ముగ్గురు అధికార ప్రతినిధులు, ఏడుగురు జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిపి మొత్తం 49 మందిని నియమించినట్లు వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం కమిటీ ప్ర ధాన లక్ష్యమని తెలిపారు. జిల్లావ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్యని అభివర్ణించారు. రాజకీయ కక్షసాధింపు ధోరణితో బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ నెల 24 నుంచి చేపట్టనున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)లో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని సూచించారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదయ్యేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి మహ్మద్‌ సలీం, జిల్లా ఓబీసీ సెల్‌ అధ్యక్షుడు కృష్ణయ్య, పార్టీ మండల అధ్యక్షుడు కోట్ల రవీందర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌, పళ్ల అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement