నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యార్థులకు మెనూ ప్రకారం ప్రతిరోజు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు ఉపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం మండలంలోని కోటకొండలో ఉన్న పీఎంశ్రీ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి బోధనపై ఆరా తీశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉన్న మైదానంలో విద్యార్థులను పలకరించి భవిష్యత్‌లో క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ఎదగాలని కోరారు. క్రీడలతో మానసికోల్లాసం, శారీరకంగా ధృడంగా ఉంటారన్నారు. ఆయన వెంట ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, పీఈటీ రమణ, ఉపాధ్యాయులు ఉన్నారు.


