అమావాస్య కారణంగా తగ్గిన విద్యార్థుల హాజరు
● వినూత్నంగా స్వాగతం పలికిన
ఉపాధ్యాయులు
● జిల్లావ్యాప్తంగా 214 ప్రవేశాలు
● పాఠశాలల్లో పాఠ్య,
రాత పుస్తకాలు పంపిణీ
–8లో u
మండలం మొత్తం హాజరైనవారు
నారాయణపేట 6,112 811
మక్తల్ 5,903 774
దామరగిద్ద 4,252 454
ఉట్కూర్ 4,162 1,448
మద్దూర్ 3,811 516
కోస్గి 3,326 1,251
ధన్వాడ 3,168 354
కృష్ణా 2,527 276
నర్వ 2,446 286
మాగనూర్ 2,334 249
మరికల్ 2,279 112
గుండుమాల్ 1,516 246
కొత్తపల్లి 1,298 167
నారాయణపేట రూరల్: వేసవి సెలవుల విరామం తర్వాత ప్రభుత్వ, పైవ్రేట్ పాఠశాలలు సోమవారం తెరుచుకున్నాయి. తొలిరోజు అమావాస్య కారణంగా చాలామంది విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలలకు పంపించేందుకు ఆసక్తి చూపలేదు. జిల్లావ్యాప్తంగా మొత్తం 43,134 మంది విద్యార్థులకు గాను సోమవారం కేవలం 6,944 మంది విద్యార్థులు రాగా.. 16 శాతం హాజరు నమోదైంది. జూన్ 12వ తేదీనే పాఠశాలలు తెరవాల్సి ఉండగా.. రెండో శనివారం, ఆదివారం రావడంతో ప్రభుత్వం 15 వ తేదీకి వాయిదా వేసి జులై రెండో శనివారం పనిదినంగా ప్రకటించింఇ. అయితే జిల్లాలోని కొ న్ని ప్రైవేట్ పాఠశాలలు అమావాస్య, మంగళవా రం సెంటిమెంట్‌తో మొదటి పనిదినాన్ని 16, 17న పునః ప్రారంభ తేదీలుగా ప్రకటించుకున్నాయి.
● మొదటిరోజు జిల్లావ్యాప్తంగా 1వ తరగతిలో 96 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా.. వారిలో 85 మంది అంగన్‌వాడీ కేంద్రాల నుంచి వచ్చిన వా రే. మిగిలిన 11 మంది చిన్నారులు నేరుగా పాఠశాల కు వచ్చిన వారున్నారు. 37 మంది 6వ తరగతి లో, 13 మంది 8వ తరగతిలో, 16 మంది 9వ తరగతిలో చేరారు. మిగతా తరగతుల్లో 52 మంది ప్రవేశాలు పొందారు. మొత్తం 214 మంది విద్యార్థుల్లో 65 మంది ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ పాఠశాలల్లో చేరారు.
ప్రీ ప్రైమరీ తరగతులు..
రెగ్యులర్ పాఠశాలలతో పాటు ప్రీ ప్రైమరీ తర గతులను సోమవారం ప్రారంభించారు. గతేడాది ప్రారంభమైన 12 చోట్ల పాత ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలు విధులు నిర్వర్తిస్తుండగా.. ఈ ఏడాది మంజూరైన 44 పాఠశాలల్లో మాత్రం ప్రధానోపాధ్యాయులు ఆ బాధ్యతను తీసుకున్నారు. ఇన్‌స్ట్రక్టర్ల, ఆయాల నియామకానికి ఈ నెల 8 వరకు దరఖాస్తు గడువు ఉండగా.. ఇన్‌స్ట్రక్టర్లకు 600, ఆయా పోస్టుకు 130 మంది దరఖాస్తులు వచ్చాయి. నియామక ప్రక్రియ కలెక్టర్ చేయాల్సి ఉండగా.. మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది.
అందని యూనిఫామ్స్..
పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు ఆయా తరగతులకు సంబంధించిన పాఠ్య, రాత పుస్తకాలను ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు పంపిణీ చేశారు. ప్రాథమిక తరగతులకు సంబంధించి వర్క్‌బుక్స్ పూర్తిస్థాయిలో రాకపోవడంతో పంపిణీ చేయలేదు. అలాగే ఈ విద్యాసంవత్సరంలో 6 నుంచి 10వ తరగతి వరకు ముద్రించిన వర్క్‌బుక్స్ జిల్లా స్టాక్ పాయింట్‌కు చేరకపోవడంతో వాటి పంపిణీ జరగలేదు. కోర్టు కేసుతో పాటు యూనిఫామ్ రంగు మార్చడంతో కుట్టేందుకు వస్త్రం రావడం ఆలస్యమవుతున్నందున పాత దుస్తులతోనే కొత్త తరగతుల్లో అడుగుపెట్టారు. విద్యార్థుల కిట్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీకి సిద్ధం చేస్తున్నందున జిల్లా నుంచి 108 మందికి సంబంధించిన పుస్తకాలు, నోట్‌బుక్స్‌ను ప్యాక్ చేసి హైదరాబాద్‌కు పంపించారు.
పాఠశాలల ముస్తాబు..
జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలతో అలంకరించి తరగతులు ప్రారంభించారు. ప్రైవేట్ పాఠశాలల్లో రంగులు వేసి ప్రత్యేక పూజలు చేశారు. కొన్ని పాఠశాలల్లో మొదటిరోజు వచ్చిన విద్యార్థులపై పూలుజల్లుతూ స్వాగతం పలికారు. కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పూలు అందించారు. మరికొన్ని చోట్ల సెల్ఫీ పా యింట్లు ఏర్పాటుచేసి పిల్లల ఫొటోలు దింపి వారి తల్లిదండ్రులకు వాట్సప్‌లో పంపించారు. చిన్నారులకు బెలూన్స్ అందించి సందడి చేశారు.


