నారాయణపేట: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, ఆస్తులు రాయించుకున్న తర్వా త వారిని వేధించడం, ఇంటి నుంచి వెళ్లగొట్టడం, పోషణ బాధ్యతలు నిర్వర్తించకపోవడం ఘటనలు జరిగితే బాధితులు కోర్టును ఆశ్రయించవచ్చని సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింధ్యానాయక్ సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా ప్రధా న న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కోర్టు ఆవరణ లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలస్తంభమని, నేటి సమాజంలో ఆ విలువలు క్రమంగా కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయాన్ని టీవీలు, మొబైల్ ఫోన్లకు కేటాయిస్తూ వృద్ధులను ఒంటరిగా వదిలేస్తున్నారన్నారు. కొందరు వృద్ధాశ్రమాల్లో చేర్చడంతో తమ బాధ్యత ముగిసిందని భావిస్తున్నారని, ఇది సమాజానికి మంచిది కాదని పేర్కొన్నారు. వారి మనోభావాలను గౌర వించి ప్రే మాభిమానాలు, ఆప్యాయత, భరోసా కల్పించాల ని సూచించారు. తల్లిదండ్రుల సంరక్షణ, పోష ణ చట్టం–2007 ప్రకారం వృద్ధులు తమ ఆస్తులను తిరిగి పొందే హక్కు కలిగి ఉంటారని స్పష్టం చేశా రు. వృద్ధులకు న్యాయపరమైన సమస్యలు ఎదురైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను లేదా టోల్‌ఫ్రీ నంబర్ 15100 ద్వారా ఉచిత న్యాయ సాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.సాయి మనోజ్, అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి అవినాష్, ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి మురళీధర్, సీనియర్ న్యాయవాది రఘువీర్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్, న్యాయవాదులు, జాగృతి కమిటీ సభ్యులు, బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది, లోక్ అదాలత్ సిబ్బంది, పోలీసులు, వయోవృద్ధులు, మహిళలు, కక్షిదారులు పాల్గొన్నారు.


