మోగనున్న బడిగంట | - | Sakshi
Sakshi News home page

మోగనున్న బడిగంట

Jun 15 2026 4:16 AM | Updated on Jun 15 2026 4:16 AM

నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం

–8లో u

నారాయణపేట రూరల్‌: నెలన్నర సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వేసవి సెలవుల్లో పిల్లలు ఆట పాటలతో ఎంతో ఉత్సాహంగా గడిపారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండటంతో సోమవారం నుంచి విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. వాస్తవానికి ఈ నెల 12న తెరుచుకోవాల్సి ఉండగా.. ప్రభుత్వం 15కి వాయిదా వేసి జులై రెండో శనివారం పనిదినంగా ప్రకటించింది. ఓ పక్క సరైన సౌకర్యాలు లేకపోగా మరోపక్క ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని చెబుతున్న మాటలు హామీలకే పరిమతమవుతున్నాయి.

కొత్త ఏడాది.. పాత సమస్యలు..

నేటి నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా.. సమస్యలు మాత్రం పాతవి పునరావృతం అవుతూనే ఉన్నాయి. జిల్లాలోని కొన్ని పాఠశాలలకు మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధజలం అందడంలేదు. దీనికితోడు స్వచ్ఛ విద్యాలయ పేరుతో నిర్మించిన మూత్రశాలలు వృథాగా ఉన్నాయి. చాలాచోట్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేక ఒకేచోట బోధన సాగిస్తున్నారు. కొన్నిచోట్ల భవనాలు శిఽథిలావస్థకు చేరుకోగా.. మరికొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తిగాక దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి.

ఉపాధ్యాయుల కొరత..

ఉపాధ్యాయ పదోన్నతులతో చాలా ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఇక బదిలీలతో పట్టణాలకు సమీపంలోకి ఉపాధ్యాయులు రావడంతో మారుమూల ప్రాంతాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. మరికొన్ని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు ప్రారంభమవుతున్నా అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు ఇప్పటి వరకు వలంటీర్ల ఊసే లేకపోవవడంతో పరిస్థితి అగమ్యగోచరమని ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాపోతున్నారు. ఇక గతంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన రవాణా భత్యం సైతం పెండింగ్‌లో ఉంది. పాఠశాల శుభ్రతకు గతేడాది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా స్కావెంజర్లను తీసుకున్నారు. ఈ ఏడాది వారిని కొనసాగించాలనే ఉత్తర్వులు ఇంకా రాలేదు.

నాలుగు మండలాల్లో అల్పాహారం..

రెండేళ్లుగా మధ్యాహ్న భోజనం విషయంలో జరిగిన సమస్యలను అధిగమించడానికి ఈసారి ముందస్తుగా వంట ఏజెన్సీ నిర్వాహకులు, టీచర్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. జిల్లాలో కడా పరిధిలో వచ్చే మద్దూర్‌, గుండుమాల్‌, కొత్తపల్లి, కోస్గి మండలాల్లోని 123 పాఠశాలల్లో మొదటి విడతగా ఉదయం వేళలో అల్పాహారం అందించనున్నారు. వారంలో మూడురోజులు పాలు, మరో మూడు రోజులు రాగిజావా అదనంగా ఇస్తారు. త్వరలో మిగతా మండలాలల్లోని పాఠశాలలకు విస్తరించనున్నారు.

కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం

పుస్తకాలు, నోట్‌బుక్స్‌ సిద్ధం..

యూనిఫామ్స్‌ జాడ లేదు

మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు

శిక్షణ పూర్తి

కడా పరిధిలోని 123 పాఠశాలల్లో అల్పాహారం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement