నారాయణపేట రూరల్: దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసి చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నితిన్ నందకర్ సూచించారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి బీజేవైఎం కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 12 ఏళ్ల సుదీర్ఘ పాలనలో మహిళలు, యువత, వృద్ధులు అన్నివర్గాల వారికి అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. దేశ రక్షణ విషయంలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొ చ్చి కులమతాలు, పార్టీలకతీతంగా మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్, పట్టణ అధ్యక్షుడు మణిశంకర్, నాయకులు ప్రవీణ్, చంద్రశేఖర్‌రెడ్డి, మోహన్, కార్తికేయ, ప్రకాష్, మణి, శివ, అంజి, రాజేష్, నవీన్ పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలు
పరిష్కరించాలి
ఊట్కూర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. లేనిపక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు కంపాటి పృథ్వి హెచ్చరించారు. మండలంలోని బిజ్వార్‌లో పీడీఎస్ యూ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించగా.. చివరి రోజు ఆయన ముఖ్యఅతిథి గా హాజరై మాట్లాడారు. శిక్షణా తరగతుల్లో వి ద్యార్థి ఉద్యమాల చరిత్ర, భారత విద్యావ్యవ స్థ, విద్యార్థుల సమస్యలు, ప్రజాస్వామ్య హక్కు లు, సామాజిక మార్పులో విద్యార్థుల పాత్ర తదితర అంశాలపై వివిధ రంగాల ప్ర ము ఖులతో అవగాహన కల్పించామన్నారు. విద్యార్థులు సమాజంపై బాధ్యతతో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్ర భుత్వం రెండున్నరేళ్ల పాలనలో విద్యారంగ స మస్యలను పరిష్కరించడంతో విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య లేదని వేలాది పాఠ శాలలను మూసివేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. ప్రైవే ట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజు ల భారం పెరిగిందని.. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇ బ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చే శారు. ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, ఫీజు రియింబర్స్‌మెంట్‌ను వి డుదల చేయాలని, పాఠశాలల్లో మౌలిక వస తులు కల్పించి, ఉపాధ్యాయుల కొరత తీర్చా లని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనిల్, నర్సింహారావు, దీక్షిత్, అజయ్, గణేశ్, సురేశ్, అనూష, రమ పాల్గొన్నారు.


