దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

Jun 15 2026 4:16 AM | Updated on Jun 15 2026 4:16 AM

కొత్తపల్లి (మద్దూరు): దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య తెలిపారు. ఆదివారం మద్దూరులోని మహిళా సమాఖ్య కార్యాలయంలో దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్‌, దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయనతో పాటు పట్టణ నాయకుడు జనార్దన్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులందరికి స్కూటీలు, ట్రై సైకిళ్లు, వీల్‌చైర్లు తదితర ఉపకరణాలు అందేవిధంగా చూస్తామని, అవసరమైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. యూడీఐడీ కార్డు అవసరం ఉన్న వారికి సంబంధిత జిల్లా అధికారితో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. వికలత్వం శరీరానికి కాని చేసే పనిలో కాదని.. దివ్యాంగులు ఆత్మ స్థైర్యంతో ముందుకెళ్లాలని జనార్దన్‌ అన్నారు. కార్యక్రమంలో ఎన్‌పీఆర్డీ నాయకుడు మధుబాబు, జిల్లా నాయకులు తెలుగు వెంకటేష్‌, నరేందర్‌ గజలప్ప, సాయిబన్న, మున్నూర్‌ వెంకటయ్య, తోక రాములు, కమిట్‌మెంట్‌ కో–ఆర్డినేటర్‌ దస్తయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement