నారాయణపేట రూరల్: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్వీఎస్ కళాశాలలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలలు, మహిళలు చట్టాల గురించి తెలుసుకోవాలని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, అమ్మాయిల అక్రమ రవాణా తదితర వాటిపై టోల్‌ఫ్రీ నంబర్ 1098కు గాని, స్థానిక పోలీసులకుగాని సమాచారం అందించాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతారన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శేషమ్మ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇజ్రాయిల్‌లో ఉద్యోగాల కు దరఖాస్తుల ఆహ్వానం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఇజ్రాయిల్ దేశంలో సంరక్షకుడు ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ కార్యాలయంలో కానీ, 94400 52081, 94400 51763 నంబర్లకు సంప్రదించాలన్నారు.
బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ ఆర్‌ఎం జగన్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: టీజీఆర్‌టీసీ మహబూబ్‌నగర్ డిప్యూటీ ఆర్‌ఎం (మెయింటెనెన్స్) గా జగన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇటీవల హైదరాబాద్‌లోని వర్క్‌షాపు నుంచి ఇక్కడికి బదిలీ అయిన విష యం విదితమే. అనంతరం ఆర్‌ఎం సంతోష్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ధాన్యం @ రూ.2,926
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. ఆర్‌ఎన్‌ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,926, కనిష్టంగా రూ.1,741 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,051, కనిష్టంగా రూ.1,651, వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,956, కనిష్టంగా రూ.4,611, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.6,950, కనిష్టంగా రూ.6,640 ధరలు పలికాయి.


