వనపర్తిటౌన్: చదరంగంతో జ్ఞాపకశక్తి, శ్రద్ధ పెంపొందుతాయని జిల్లా చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డా. మురళీధర్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో అండర్–9, 11, 13 విభాగాల్లో రాష్ట్రస్థాయి చెస్ క్రీడాకారుల ఎంపికలను డీవైఎస్‌ఓ సుధీర్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదరంగం మెదడుకు వ్యాయామమని, సమస్యల పరిష్కారం, సామర్థ్యాలు, సృజనాత్మకతను పెంపొందిస్తాయని చెప్పారు. పోటీల్లో 80 మంది బాలబాలికలు పోటీ పడ్డారని చెప్పారు. మొదటి, రెండో బహుమతి సాధించిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అండర్–9 బాలికల విభాగంలో టి.మనస్విరెడ్డి మొదటి, అద్విత ద్వితీయ, మధుమిత మూడో బహుమతి సాధించారు. అలాగే బాలుర విభాగంలో సాజిత్ (వనపర్తి) మొదటి, అద్విక్ (నాగర్‌కర్నూల్) రెండు, అండర్–11 బాలికల విభాగంలో కార్తీక (వనపర్తి) మొదటి, ఆరాధ్య శ్రీ (నాగర్‌కర్నూల్) రెండు, పరశస్విరెడ్డి (వనపర్తి) మూడో బహుమతి సాధించినట్లు వివరించారు. బాలుర విభాగంలో రంగం యోజిత్ (మహబూబ్‌నగర్) మొదటి, అఖిలేష్ (నాగర్‌కర్నూల్) రెండు, జి.శ్రీతిక్ (వనపర్తి) మూడో బహుమతి, అండర్–13 బాలికల్లో వేముల మేధశ్రీ (నాగర్‌కర్నూల్) మొదటి, ఎన్.అక్షిత (వనపర్తి) రెండు, వైష్ణవి (నాగర్‌కర్నూల్) మూడో బహుమతి, బాలుర విభాగంలో నమ్రత్ గౌడ్ (నాగర్‌కర్నూల్) మొదటి, శ్రీహాన్ (వనపర్తి) రెండు, మణిదీప్ (నాగర్‌కర్నూల్) మూడో బహుమతి సొంత చేసుకున్నారని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, జిల్లా ప్రధానకార్యదర్శి వేణుగోపాల్‌నాయుడు, జిల్లా కోశాధికారి టీపీ కృష్ణయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శులు రవీందర్‌గౌడ్, అయోధ్య రాములు, ఎగ్జిక్యూటీవ్ సభ్యులు భూషణ్, మోహన్, డీసీఏ సభ్యులు రాములు, హర్ష తదితరులు పాల్గొన్నారు.


