విద్యార్థులకు సహకారం అందిస్తాం..
కన్నడ మీడియం విద్యార్థులకు కర్ణాటక ప్రభుత్వం నుంచి తమవంతు సహకారం అందిస్తున్నాం. మన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అక్కడి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రిజర్వేషన్లు, ఉద్యోగాలు ఇప్పించేందుకు ఎలాంటి అధికారం లేదు.
– నాగభూషణ్, నాయకుడు, గడినాడ కన్నడ సంఘం, గుడెబల్లూర్
భాషపై రాద్ధాంతం వద్దు..
మేము ఈ ప్రాంత విద్యార్థుల అభ్యున్నతికి కొన్నేళ్లుగా కర్ణాటక ప్రభుత్వంతో పోరాడుతున్నాం. ఈ ప్రాంతంలోని కన్నడ పాఠశాలలకు గతంలో కొన్ని నిధులు అందించారు. కృష్ణా ఉన్నత పాఠశాలలో ఓ భవనం కూడా కర్ణాటక ప్రభుత్వం నిర్మించింది. అయినా మేము కన్నడ మీడియం చదవాలని బలవంతం చేయడం లేదు. ఇప్పటికే చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌కు పోరాడుతున్నాం.
– రాంలింగప్ప, గౌరవ అధ్యక్షుడు, గడినాడ కన్నడ సంఘం, కున్సీ
రిజర్వేషన్లు మా చేతుల్లో లేవు..
కన్నడ మీడియం చదువుతున్న విద్యార్థులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నాం. నాతో పాటు కొందరు ఉపాధ్యాయులు కలిసి పలుమార్లు కర్ణాటక ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించాం. ఆ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులను కలిసి గడినాడ ప్రాంత విద్యార్థుల సమస్యలు వివరించాం. ఇందుకు నా సొంత డబ్బులు రూ.లక్షలు ఖర్చు చేశా. అయినా మాపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము రిజర్వేషన్లు, ఉద్యోగులు ఇచ్చే వాళ్లం కాదు. ఇక్కడి విద్యార్థుల తరఫున చాకిరి చేసేవాళ్లం.
– అమర్‌కుమార్ దీక్షిత్, మాజీ సర్పంచ్, కన్నడ సంఘం నాయకుడు, కృష్ణా
ప్రభుత్వం చొరవ చూపాలి..
కన్నడ మీడియం విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వంతో పాటు మనం కూడా చొరవ తీసుకోవాలి. గ్రామా ల్లోని పేద ప్రజలకు భాషపై అవగాహన కల్పించాలి. ప్రజల్లో మార్పు తీసుకురావాలి. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది.
– నల్లె శివరాజ్, ఉపాధ్యాయుడు, కున్సీ
సమన్వయం పాటించాలి..
ఇరు భాషా ప్రేమికులు సమన్వయంతో ముందుకెళ్లాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడి ప్రజలు కలిసి ఉండాలేగాని విడిపోకూడదు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి.
– రమేష్, మండల అధ్యక్షుడు, తపస్ సంఘం
విద్యార్థులకు సహకారం అందిస్తాం..
విద్యార్థులకు సహకారం అందిస్తాం..
విద్యార్థులకు సహకారం అందిస్తాం..
విద్యార్థులకు సహకారం అందిస్తాం..


