వైద్య పరికరాలు విరాళం | - | Sakshi
Sakshi News home page

వైద్య పరికరాలు విరాళం

Nov 1 2026 7:13 AM | Updated on Nov 1 2026 7:13 AM

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల దేవస్థానం వైద్యశాలకు శనివారం హైదరాబాద్‌కు చెందిన దాత సరోజినీ అగర్వాల్‌ రూ. 4.31 లక్షల విలువ చేసే అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా అందజేశారు. సీమెన్స్‌ కంపెనీకి చెందిన ఏబీజీ ఎనలైజర్‌తో పాటు మూడు కాట్రిడ్జ్‌లను దేవస్థానం వైద్యశాల అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు దాత అందించిన పరికరాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు దాతకు శేషవస్త్రాలు, శ్రీ స్వామిఅమ్మవార్ల ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు బి. శ్రీనివాసులు, సీనియర్‌ అసిస్టెంట్‌ కె. శ్రీ నివాసప్రసాదు, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అనుమానంతో అంతమొందించాడు!

బనగానపల్లె: పట్టణంలోని కొండపేటలో శనివారం ఓ వ్యక్తి అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేశాడు. సీఐ ప్రవీణ్‌కుమార్‌ వివరాల మేరకు.. కొండపేటలోని సయ్యద్‌వాడీ కా లనీకి చెందిన అల్లాబకాష్‌, జరీనాబీ(34) దంపతులు గత కాలంగా గోవులను మేపుతూ జీవ నం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. అయితే భార్య జరీనాబీకి ఆమె బంధువుతో వివాహేతర సంబంధం ఉందని భర్త అల్లాబకాష్‌ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో పలుమార్లు వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం వారి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి గురైన అల్లా బకాష్‌ భార్యను గొడ్డలితో మెడపై నరికి చంపి పారిపోయాడు. విషయం తెలుసుకున్న వెంటనే సీఐ ప్రవీణ్‌కుమార్‌ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ మద్యం పట్టివేత

కర్నూలు: నగర శివారులోని పంచలింగాల జిల్లా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఎకై ్సజ్‌ అధికారులు అక్రమ మద్యం పట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం రవాణా అరికట్టేందుకు ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధి లోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా పంచలింగాలకు చెందిన అజయ్‌కుమార్‌ తెలంగాణ నుంచి 48 మద్యం బాటిళ్లను తీసుకొని వస్తుండగా వాహనం ఆపి తనిఖీ చేయగా బయటపడ్డాయి. మద్యం స్వాధీనం చేసుకుని అజయ్‌కుమార్‌ను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి అక్రమంగా రవాణా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తనిఖీల్లో కర్నూలు ఎకై ్సజ్‌ సీఐ చంద్రహాస్‌, ఎస్‌ఐ నవీన్‌, విశ్వేశ్వరరావు, ట్రైనీ ఎస్‌ఐ హరికృష్ణ, ఎస్‌ఎస్‌ టీమ్‌ భక్తవత్సలం తదితరులు ఉన్నారు.

మద్యం సీసాలు స్వాధీనం

డోన్‌ టౌన్‌: పట్టణంలోని తారకరామనగర్‌లో ఒక మహిళ వద్ద అక్రమంగా ఉన్న 11 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్‌, ఎౖక్సైజ్‌ సీఐ జప్రూల్లా శనివారం తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా శుక్రవారం సాయంత్రం నుంచే పట్టణంలో మద్యం సరఫరాను కట్టడి చేసి దుకాణాలు సీజ్‌ చేసినట్లు సీఐ తెలిపారు. ఎవరైనా మద్యం విక్రయించినా, అక్రమంగా సరఫరా చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దాడుల్లో ఎస్‌ఐ సోమశేఖర్‌రావు, ట్రైనీ ఎస్‌ఐ అన్వేష్‌, సిబ్బంది సుధాకర్‌రెడ్డి, నాగరాజు, చిన్నకృష్ణ, శివపార్వతి, రవికృష్ణ తదితరులు ఉన్నారు.

ఉపాధి కూలీ మృతి

కొత్తపల్లి: శివపురంలో గ్రామంలో ఓ మహిళ ఉపాధి పనులు చేస్తూ అస్వస్థతకు గురై మృతి చెందింది. గ్రామానికి చెందిన బాసిపోగు పార్వతమ్మ (66) శనివారం ఉదయం గ్రామసమీపంలో జరుగుతున్న వీబీజీ రాంజీ పనులకు వెళ్లిది. అక్కడ పనిచేస్తూ ఛాతిలో నొప్పితో అస్వస్థతకు గురై కుప్పకూలి పడిపోయింది. గమనించిన కూలీలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. సేద తీరుతుండగా మృత్యువాత పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement