కమనీయం.. స్వర్ణ రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. స్వర్ణ రథోత్సవం

Nov 1 2026 7:13 AM | Updated on Nov 1 2026 7:13 AM

స్వామి అమ్మవార్లకు ఆలయ మాడ వీధుల్లో స్వర్ణ రథోత్సవం

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. శనివారం వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించి స్వర్ణ రథోత్సవం జరిపించారు. భక్తుల శివనామస్మరణ నడుమ ఈ స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు తిరిగి అక్కడి నుంచి నంది మండపం వరకు రథోత్సవం కొనసాగింది. పలు కళా బృందాల కోలాటం, తప్పెట చిందులు, మొదలైన జానపద కళారూపాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పలువిభాగాల అధికారులు, పర్యవేక్షకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement