షెడ్‌లోకి దూసుకెళ్లిన ట్యాంకర్‌ | - | Sakshi
Sakshi News home page

షెడ్‌లోకి దూసుకెళ్లిన ట్యాంకర్‌

Nov 1 2026 7:13 AM | Updated on Nov 1 2026 7:13 AM

● ప్రాణాలతో బయటపడిన ఓ కుటుంబం

మంత్రాలయం రూరల్‌: చిలకలడోణ గ్రామంలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఓ కుటుంబం క్షేమంగా బయటపడటంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. కర్ణాటక రాష్ట్రం రాయచూరు నుంచి స్పిరిట్‌ లోడ్‌తో పాండిచ్చేరి వెళ్తున్న ట్యాంకర్‌ మార్గమధ్యలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చిలకలడోణ వద్ద అదుపు తప్పింది. రహదారి పక్కనే ఉన్న హోటల్‌ షెడ్‌లోకి దూసుకెళ్లింది. షెడ్‌ ముందు డ్రైనేజీ కాల్వ ఉండటంతో ట్యాంకర్‌ ఇరుక్కుపోయి నిలిచిపోయింది. ఆ సమయంలో షెడ్‌ పక్కనే ఉన్న కొట్టంలో దంపతులతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ట్యాంకర్‌ కొట్టం వద్ద నిలిచిపోవడంతో ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. లారీ డ్రైవర్‌ను గ్రామస్తులు బయటకు తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మంత్రాలయం–కల్లుదేవకుంట మధ్యలో శనివారం వేకు వ జామున కారు ప్రమాదానికి గురైంది. రాయచూ రు జిల్లా పంచముఖి గ్రామానికి చెందిన భీమయ్య, మునేష్‌ కర్నూలు నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108లో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు రాయచూరుకు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement