● జిల్లా డిప్యూటీ ట్రెజరీ డైరెక్టర్
రామచంద్రరావు
ఆలూరు: ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేస్తే మంచి గుర్తింపు వస్తుందని జిల్లా డిప్యూటీ ట్రెజరీ డైరెక్టర్ రామచంద్రరావు అన్నారు. అలూరులోని ఉమాకల్యాణ మండపంలో ఆలూరు ఎస్టీఓ డి. శ్రీనివాసులు పదవీ విరమణ వీడ్కోలు కార్యాక్రమాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి మానసిక ఒత్తిడిని తట్టుకుని పనిచేయాల్సి ఉంటుందన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధతతో శ్రీనివాసులు పనిచేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఆదోని ఏటీఓ వెంకటరమణ, డిప్యూటీ ఈఓ రాజేంద్రప్రసాద్, ఏపీ ఎన్జీవో జిల్లా మాజీ అధ్యక్షుడు వెంగళ్రెడ్డి, ఆలూరు నియోజకవర్గం ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మోహన్, సాయిబాబు, ఆలూరు ఎంఈఓ 2 చిరంజీవిరెడ్డి, మద్దికెర ఎంఈఓ రంగస్వామి, ఎస్టీయూ నాయకులు నాగరాజ్, నాయకులు గోవిందప్ప, రమణారెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


