మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులపై పోలీసుల సమక్షంలో టీడీపీ నాయకులు చేసిన దాడులు చూస్తుంటే ప్రజాస్వామ్యం సిగ్గుపడి తలవంచుకుంటుందని మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ అభ్యర్థులపై టీడీపీ అభ్యర్థులు, నాయకులు దాడులు చేస్తున్నారన్న సమాచారంతో హుటా హుటిన మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నామన్నారు. అయితే అప్పటికే తమ నాయకులపై టీడీపీ నాయకులు విచక్షణా రహితంగా దాడి చేయడాన్ని చూసి చలించిపోయారు. నామినేషన్లో అభ్యంతరాలు ఉన్నాయంటే న్యాయబద్ధంగా చూసుకోవాలే తప్ప దాడులకు తెగబడటం తగదన్నారు. టీడీపీ అభ్యర్థులపై కేసులు ఉన్నాయని న్యాయవాది చెబితే ఆయనపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించడం టీడీపీ నాయకులకే చెల్లిందన్నారు.


