శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో దేదీప్యమానంగా దసరా మహోత్సవాలు సాగుతున్నాయి. దసరా మహోత్సవాల్లో సోమవారం సిద్దిదాయిని స్వరూపంలో భ్రమరాంబాదేవి, కైలాస వాహనంపై భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు విహరించి భక్తులకు ఆశీస్సులు అందించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా స్వామిఅమ్మవార్లను కై లాస వాహన సేవలో అలంకరించారు. ప్రత్యేక అంకీకృతులైన స్వామిఅమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపంలో ఆశీనులను చేసి ఉభయ దేవాలయాల అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సిద్దిదాయిని అమ్మవారిని, కై లాస వాహనంపై ఆశీనులైన స్వామిఅమ్మవార్లకు ఆలయ ఉత్సవం నిర్వహించి గ్రామోత్సవానికి తరలించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో కోలాటలు, తప్పెట్లు, కర్ణాటక డ్రమ్స్, మేళాతాళాలు, డప్పు వాయిద్యాలు, కళాకారుల విచిత్ర వేషధారణలు, నృత్యాలతో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఆయా పూజా కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం
తరఫున పట్టువస్త్రాల సమర్పణ
దసరా మహోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామిఅమ్మవార్లకు సంప్రదాయబద్దంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థనరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా రాజగోపరం వద్ద పట్టువస్త్రాలకు అర్చకస్వాములు, వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పట్టువస్త్రాలను మంత్రి, ఎమ్మెల్యే, శ్రీశైలం చైర్మన్, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ఈఓ తలపై పెట్టుకుని ఆలయ ప్రదిక్షిణ చేసి స్వామిఅమ్మవార్లకు సమర్పించారు.
శ్రీశైలంలో నేడు
దసరా మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం సహస్ర చండీపారాయణ పూర్వక శతచండీయాగ పూర్ణాహుతి, రుద్రయాగ పూర్ణాహుతి, కలశోద్వాసన, వసంతోత్సవం, అవభృంథం కార్యక్రమాలు నిర్వహిస్తారు. భ్రమరాంబాదేవి నిజరూప అలంకారంలో, నందివాహనంపై భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. శమీ పూజ, తెప్పోత్సవం నిర్వహించనున్నారు.
శ్రీశైలంలో దేదీప్యమానంగా
దసరా మహోత్సవాలు
సిద్దిదాయిని అలంకారంలో
దర్శనమిచ్చిన శ్రీశైల
భ్రమరాంబాదేవి
కై లాస వాహనంపై విహరించిన భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున
స్వామిఅమ్మవార్లకు
పట్టువస్త్రాలు సమర్పణ


