ఆళ్లగడ్డ: స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిపించాల్సిన అధికారులే పసుపు కండువా కప్పుకుని అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ జీ హుజూర్ అంటూ సాగిలపడు తున్నారు. ఎన్నికల నియమావాళిని అధికార పక్షం బేఖాతార్ చేస్తుంటే ఆ విషయం వేలాది మంది చూస్తున్నా నిస్సిగ్గుగా ఎన్నికల అధికారులు, పోలీసులు పేక్షక పాత్ర పోషించారు. మున్సిపాలిటి పరిధిలోని 32 వార్డులకు సంబంధించి పరిశీలన జరుగుతున్న సందర్భంగా వైఎస్సార్‌సీపీకి చెందిన ఏడుగురు వార్డు అభ్యర్థులను నామినేషన్ల పరిశీలనకు రాకుండా టీడీపీ నేతల ఆదేశాలతో సీఐలు రాము, ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఎస్‌ఐలు రామోహన్‌రెడ్డి, చిన్న పీరయ్య, రఫీ, ఆర్‌ఐ బాబు అడ్డుకున్నా రు. ఉదయమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆరోఓ కార్యా లయానికి చేరుకున్నారు. అయితే ‘ఇప్పుడు టీడీపీ వారు ఉన్నారు. మధ్యాహ్నం మీకు టైం ఇస్తాం రండి’అని పోలీసులు చెప్పి పంపించారు. ఆర్వో కార్యాలయంలోనే తిష్టవేసిన టీడీపీ నేతలు ఎంతకు బయటకు పోలేదు. వారుపోయిన తరువాత మీరు రావాలని చెపుతుండటంతో.. టైం ఇస్తారు కదా అని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎదురుచూస్తు ఉన్నారు. తీరా సమయం ముగిసిపోతుందన్న సమయంలో రమ్మంటూ శాంతిభద్రతల పేరుతో దారి మళ్లించి బైపాస్ మీద పడకండ్ల వైపు రావాలని ఆదేశించారు. చుట్టూ తిరిగి వచ్చినా 200 మీటర్ల దూరంలో నిలిపి తనిఖీల పేరుతో పోలీసులు ఆలస్యం చేశారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ అభ్యర్థులందరూ పరుగెడుతూ లోపలకు పోతుండగా అక్కడే ఉన్న టీడీపీ గూండాలు గట్టిగా కేకలు వేసుకుంటూ వచ్చి అడ్డుకున్నారు. మహిళా అభ్యర్థులు అని కూడా చూడకుండా దాడి చేసేందుకు యత్నించారు. పోలీసుల ఎదుటే దాడులు జరుగుతున్నా నీళ్లు నములుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బయటకు పంపడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎమ్మెల్యే అఖలప్రియ తమ్ముడు విఖ్యాత్‌రెడ్డి ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల కార్యాలయంలోనే తిష్టవేసుకుని కూర్చుకున్నారు. ఎమ్మెల్యేతో కలిసి రాత్రి మరోసారి కార్యాలయంలోకి వచ్చి వెళ్లారు. అస్సలు అక్కడ ఏం జరుగుతుందో.. ఎవ్వరికి అర్థంకాని సవాలక్ష ప్రశ్నలుగా మిగిలిపోయాయి. రాత్రి పొద్దుపోయే వర కు కూడా పరిశీలనలో ఎంత మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు, ఎంత మంది అభ్య ర్థుల నామినేషన్లు ఆమోదించారన్న సమాచారం నోటీస్ బోర్డులో పెట్టలేదు. చివరకు ఆరోవో కార్యాలయాన్ని మూసేసి వెళ్లిపోవడంతో రేపు ఉదయం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని నామినేషన్లు దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
నామినేషన్ల పరిశీలనకు
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు
హాజరుకాకుండా పోలీసుల నాటకం
ఉదయం నుంచి ఆర్‌ఓ కార్యాలయంలో
ఎమ్మెల్యే తమ్ముడు తిష్ట
బరిలో నిలిచిన అభ్యర్థులను
ప్రకటించకుండా వెళ్లిపోయిన అధికారులు


