శ్రీశైలంలో నేడు.. | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో నేడు..

Oct 18 2026 1:30 AM | Updated on Oct 18 2026 1:30 AM

స్వామిఅమ్మవార్లకు ఆలయ ఉత్సవం

శ్రీశైలంటెంపుల్‌: దసరా మహోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీశైలంలో గజవాహనంపై స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. గజ వాహనంపై కొలువుదీరిన పార్వతీ పరమేశ్వరులను అలంకార మండపంలోకి అధిష్టింపజేసి అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాళరాత్రి అమ్మవారిని, గజ వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు ఆలయ ఉత్సవం జరిపారు. గంగాధర మండపం నుంచి నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు నిర్వహించిన గ్రామోత్సవం కనులపండువగా సాగింది. గ్రామోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

శుభంకరీ.. కాళరాత్రి

దసరా మహోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారు కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకారంలో అమ్మవారు గార్ధభ వాహనంపై నల్లని వర్ణంలో ఉంటారు. శిరోజాలు చెల్లాచెదురై.. మెడలో శక్తికాంతులు వెదజల్లే హారం ఉండి, త్రినేత్రాలు బ్రహ్మాండ సమంగా గోళాకారంలో ఉంటాయి. కుడిచేతి ద్వారా సమస్త ప్రాణులకు వరాలను ప్రసాదిస్తూ..కిందిచేయి హస్తం అభయముద్రలో ఉంటుంది. ఎడమ చేతిలో ఖడ్గం, కింది హస్తంలో లోహకంఠకం ఉంటాయి. అమ్మవారిని ఉపాసిస్తే గ్రహబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.

శంఖం పూరిస్తున్న దృశ్యం

దసరా ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం భ్రమరాంబాదేవి మహాగౌరి అలంకారంలో, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లు నందివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement