మట్టి తీయకుండా ‘మస్టర్‌’ ప్లాన్‌! | - | Sakshi
Sakshi News home page

మట్టి తీయకుండా ‘మస్టర్‌’ ప్లాన్‌!

Oct 18 2026 1:30 AM | Updated on Oct 18 2026 1:30 AM

● రూ.2.47 లక్షలు స్వాహా ● వీబీజీరామ్‌జీలో తారా స్థాయికి అక్రమాలు

● రూ.2.47 లక్షలు స్వాహా ● వీబీజీరామ్‌జీలో తారా స్థాయికి అక్రమాలు

కర్నూలు(అగ్రికల్చర్‌): తవ్వలేదు.. మట్టి తీయలేదు.. అయినా 793 పనిదినాలకు మస్టరు వేశారు. టీడీపీ నాయకులు, ఉపాధి సిబ్బంది కుమ్మకై ్క రూ.2.47 లక్ష ల కొల్లగొట్టారు. పత్తికొండ మండలం తుగ్గలిలో వీబీ జీరామ్‌జీ కింద చేపడుతున్న పనులే ఇందుకు నిదర్శంగా నిలిచాయి. తుగ్గలిలో చిదానంద ల్యాండ్‌ నుంచి సీతారామయ్య ల్యాండ్‌ వరకు రెనోవేషన్‌ ఆఫ్‌ ఫీడర్‌ చానల్‌ పనులు చేపట్టేందుకు ఎస్టిమేట్లు జనరేట్‌ చేశా రు.ఒక్క రోజు కూడ పని జరిగిన దాఖలాలు లేవు. ఒక్క గంప మట్టి కూడా తీయలేదు. చేయని పనికి 20 కాదు 30 కాదు...ఏకంగా 793 పని దినాలకు బినామీ మస్టర్లు వేశారు. మొబైల్‌ ఫోన్‌లో ఉన్న వీడియోలను ఫొటోలు తీసి పనులు జరిగినట్లు చూపారు. మొత్తం 793 పనిదినాల్లో 264 పని దినాలకు రూ.80,116 నిధులు విడుదలయ్యాయి. మిగిలిన 529 పనిదినాల కు కూడా ఇటీవల నిధులు విడుదలైనట్లు తెలుస్తోంది. ఒక గంప మట్టి తీయకపోయినప్పటికీ 793 పనిదినాలకు మస్టర్లు వేశారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. టీడీపీ నేతలు, పీల్డ్‌ అసిస్టెంటు మొ దలు కొని ఏపీవో వరకు అందరు కుమ్మకై ్క నిధులను కొల్లగొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అక్రమార్కులపై చర్యలు శూన్యం

తుగ్గలి మండలంలో జరిగే అక్రమాలపై ఇటీవల ‘సాక్షి’లో ‘సొమ్మసిల్లే అక్రమాలు’ అనే శీర్షికన కథనం ప్రచురితం అయింది. విద్యార్థులతో పాటు హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల్లో వివిధ వృత్తుల్లో రాణిస్తున్న వారు సైతం ఉపాధి పనులకు హాజరువుతున్నారని సాక్షాలతో చూపినా ఫలితం లేదు. ఫిర్యాదులు రావడంతో తుగ్గలిలో డోర్‌టు డోర్‌ విచారణ చేపట్టారు. విచారణలో పనులకు పోకపోయినప్పటికీ మస్టర్లు వేస్తున్నారని అనేక మంది చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ చర్యలు లేవు. దీంతో అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. టీడీపీ పాలనలో దొంగ మస్టర్లు వేయడం, చేయని పనులకు నిధులు కొల్లగొట్టడం సర్వసాధారణం అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement