ఈ ఏడాది ఎకరా సొంత పొలంతోపాటు ఎకరాకు రూ. 16 వేలు చెల్లించి మరో నాలుగున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్క జొన్న సాగు చేశాను. పైరు వివిధ దశల్లో వర్షాలు కురియకపోడంతో బోరు సాయంతో పైరుకు పలు దఫాలు సాగునీటిని మళ్లించుకున్నాను. ఎకరాకు 40 వేలకు పైగా ఖర్చు చేయగా ఎకరాకు 15 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవు.
– హరి, రైతు, సౌదరదిన్నె,
కోవెలకుంట్ల మండలం
ఎకరా రూ. 16 వేలు కౌలు చెల్లించి ఈ ఏడాది ఖరీఫ్లో ఏడు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాను. విత్తనం నాటినప్పటి నుంచి వర్షాలు కురియకపోవడంతో సాగునీటిని మళ్లించేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 35 వేలు ఖర్చు వచ్చింది. ఇటీవలే నాలుగు ఎకరాల్లో కోత, నూర్పిడి పనులు చేపట్టాను. వర్షాభావ పరిస్థితులతో ఎకరాకు 15 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు.
– పుల్లారెడ్డి, అమడాల, కోవెలకుంట్ల మండలం


