ఐలు నేతల పిలుపు
ముగిసిన జిల్లా ఐలు ఐదో మహాసభలు
కర్నూలు(సెంట్రల్): న్యాయవాదుల హక్కుల కోసం పోరాటాలు చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్‌యూ) కన్జ్యూమర్ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం కర్నూలు నగరంలోని ఓ హోటల్ హాలులో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) 5వ కర్నూలు జిల్లా మహాసభలు జరిగాయి. ఐలు రాష్ట్ర సంఘం సహా వ్యవస్థాపక నాయకులు ఆర్. రామాంజనేయులు జెండాను ఆవిష్కరించి మహాసభలు ప్రారంభించా రు. జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షతన వహించిన సభలో ముఖ్య అతిథులుగా హాజరైన కన్జ్యూమర్ జిల్లా ఫోరం మెంబర్ నారాయణ రెడ్డి, రాష్ట్ర ఐలు కోశాధికారి రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి కె.కుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకమన్నారు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని, జూనియర్ అడ్వకేట్‌లకు స్టైఫండ్‌ను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని, అడ్వకేట్స్ డెత్ బెనిఫిట్ రూ.15 లక్షలకు పెంచి అమలు చేయాలని, న్యాయవాదులకు ఆరోగ్య బీమా కార్డులు ఇవ్వాలని, ఇళ్ల స్థలాల కేటాయించి న్యాయవాద కాలనీలను ఏర్పాటు చేయాలని మహాసభల్లో పలు తీర్మానాలు చేసి ఆమోదించారు.
నూతన కమిటీ ఎన్నిక..
మహాసభల్లో 42 మందితో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు దిడ్డి వెంకటస్వామి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా శ్రీనివాసమూర్తి, కె.కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగరా జు లక్ష్మణ్, కోశాధికారి శివ ప్రసాద్ గుప్తా, ఉపాధ్యక్షులుగా పి. నిర్మల, మురళీమోహన్, ఆజాద్, తిమ్మప్ప, జి. వెంకటరమణ, సాయికుమార్ రెడ్డి, జాస్మిన్ కార్యదర్శిలుగా షాకీర్, మహమ్మద్ రఫీ, సంజమ్మ, మహేష్ కుమార్, పార్వతితోపాటు 26 మంది సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


