ప్రజలకు సేవ చేసేందుకే | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు సేవ చేసేందుకే

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

ప్రజలకు సేవ చేసేందుకే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. బాధ్యత పెంచే ఉద్యోగం

బీఎస్సీ చదువుకున్నాను. మా నాన్న రవిప్రసా ద్‌, తల్లి మనెమ్మ వ్యవసాయం చేస్తా రు. వారి ఆశయాలను వ మ్ముచేయను. ప్రజలకు సేవ చేసేందుకే పోలీసు శాఖలోకి వచ్చా. నాకు పోలీ సంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి. శిక్షణ పూర్తి కావడంతో విధుల్లో ఎప్పుడు చేరతానా అన్న ఉత్సుకత ఉంది. – మహేష్‌, పోలవరం, తూగో జిల్లా

బీటెక్‌ చదివాను. తల్లిదండ్రులు శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి ప్రోత్సాహంతో పోలీసునవుతున్నా. శిక్షణలో శాంతిభద్రతలకు సంబంధించిన అనేక అంశాలపై తర్ఫీదునిచ్చారు. పోలీసుకు ఎంపిక కావడం, శిక్షణ పూర్తవడం చకచకా జరిగిపోయాయి. సమాజం బాగు కోసం శక్తివంచన లేకుండా విధులు నిర్వహిస్తా.

– సుబ్రహ్మణ్యం, పోలవరం, తూగో జిల్లా

బీటెక్‌ పూర్తి చేశా. పోలీసు శాఖలో ఎస్‌ఐ కావాలన్నది లక్ష్యం. తండ్రి ఓబుల్‌ రెడ్డి, తల్లి నాగమ్మ వ్యవసాయం చేస్తుంటారు. పోలీసు అంటే బాధ్యతాయుతమైన వృత్తి. గౌరవంతో పాటు సమాజంలో బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు రక్షణగా నిలిచే అవకాశం ఉంటుంది. ఉద్యోగ విధిని నిర్వహిస్తూనే ఎస్‌ఐ కావాలనే లక్ష్యాన్ని చేరుకుంటా.

– ఓబుల్‌ రెడ్డి, కడప జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement