కర్నూలు: సివిల్ చట్టాలకు సంబంధించిన కొన్ని అంశాలపై జిల్లాస్థాయి న్యాయాధికారులకు వర్క్‌షాప్ జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు కర్నూలులోని జిల్లా న్యాయస్థాన ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వాసు పర్యవేక్షణలో ఈ కార్యక్ర మం జరిగింది. అధ్యాపకులుగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.హరినాథ శర్మ, రిటైర్డ్ జిల్లా జడ్జి హరికృష్ణ భూపతి పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మన రాజా, నంద్యాల జిల్లా మూడవ అదనపు న్యాయమూర్తి లీలావతి, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి లక్ష్మీరాజ్యం, 7వ అద నపు జిల్లా న్యాయమూర్తి రాజేంద్రబాబు, పోక్సో న్యాయమూర్తి ఎన్.శ్రీవిద్య, ఏసీబీ న్యాయమూర్తి ఎం.వి.హరినాథ్, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన సీనియర్, జూనియర్ సివిల్ న్యాయమూర్తులు పాల్గొన్నారు.


