సౌర విద్యుదుత్పత్తికి రుణాలు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

సౌర విద్యుదుత్పత్తికి రుణాలు ఇవ్వండి

Aug 20 2026 3:52 AM | Updated on Aug 20 2026 3:52 AM

బ్యాంకర్లతో విద్యుత్‌ శాఖ

ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రధానమంత్రి సూర్యఘర్‌ కింద సౌర విద్యుత్‌ ఉత్పత్తికి బ్యాంకులు విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్‌ కోరారు. బుధవారం కర్నూలులోని విద్యుత్‌ భవన్‌లో బ్యాంకు అధికారులు, సౌర విద్యుత్‌ వెండర్లతో నిర్వహించిన సమావేశంలో లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌(ఎల్‌డీఎం)తో కలసి పాల్గొన్నారు. ముందుగా సౌర వెండర్లు మాట్లాడుతూ రుణాల మంజూరులో ఎదురవుతున్న సమస్యలను బ్యాంకర్ల దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్‌ ఖర్చులను తగ్గించుకునేందుకు గ్రీన్‌ ఎనర్జీ, సౌర విద్యుత్‌ వినియోగం ఎంతో కీలకమన్నారు. సౌర వెండర్లు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. ఎల్‌డీఎం మోహన్‌ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 10వేల ప్రధానమంత్రి సూర్యఘర్‌ యోజన దరఖాస్తులను బ్యాంకులకు పంపామన్నారు. దరఖా స్తుల పరిశీలన, రుణాల మంజూరు, పంపిణీ ప్రక్రియ ను బ్యాంకులు వేగవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement