బాధాకరం | - | Sakshi
Sakshi News home page

బాధాకరం

Jun 20 2026 11:31 AM | Updated on Jun 20 2026 11:31 AM

బాధాకరం ప్రయోజనం లేదు

మాకు సొంత భూమి లేదు. కౌలుకు 6.50 ఎకరాలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఈ సారి పత్తి సాగు చేశా. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి చేయూత లేదు. గత ప్రభుత్వం వైఎస్సార్‌ రైతుభరోసా కింద ఆర్థిక సహాయం అందించింది. చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని పక్కన పెట్టడం బాధాకరం. బ్యాంకులు కూడా పంట రుణాలు ఇవ్వడం లేదు.

– శేషన్న, జి.సింగవరం, కర్నూలు మండలం

మేం దేవాలయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాం. మాకు ఐదు ఎకరాలకు సీసీఆర్‌ కార్డును ప్రభుత్వం జారీ చేసింది. అన్నదాత సుఖీభవ కింద సాయం దక్కుతుందని ఆశించాం. ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. గత ఏడాది కూడా కౌలు రైతులను పట్టించుకోలేదు. ఈ సారి కూడా అన్యాయం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోకపోతే సాగులో ఎలా రాణిస్తాం? ఇప్పటికై నా చంద్రబాబు చొరవ తీసుకొని కౌలురైతులకు న్యాయం చేయాలి.

– జంగం జంబులింగయ్య,

ఆర్‌.కొంతలపాడు, కర్నూలు మండలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement