గతేడాది యూరియా దొరకక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మార్కెట్‌లో అధిక ధరతో కొనుగోలు చేసి పైర్లు కాపాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు యాప్ ద్వారా ఎరువులు కొనాలని చెబుతున్నారు. రైతులకు అవసరమైన మేరకు ఇస్తారో లేదో తెలియదు. కష్టాలు తొలిగేలా లేవు.
– గోపాల్‌రెడ్డి, రైతు,
సాంబవరం, గోస్పాడు మండలం
ఈ ఏడాది నాకున్న సొంత పొలంలో 1.25 ఎకరాల్లో మొక్కజొన్న, 2.17 ఎకరాల్లో మిరప సొగుకు పొలాన్ని సిద్ధం చేసుకున్నాను. మొక్కజొన్న సాగుకు అదును కాగా పంటల సాగు వివరాలు యాప్‌లో నమోదు చేయించుకున్నాను. యూరియా, డీఏపీ కొనుగోలుకు ఎరువుల దుకాణానికి వెళితే ఇవ్వడం లేదు.
– కుళాయప్ప, రైతు, అమడాల,
కోవెలకుంట్ల మండలం
నాకున్న రెండు ఎకరాల సొంత పొలంతోపాటు ఎకరా రూ. 10 వేలు కౌలు చెల్లించి మరో రెండు ఎకరాలకు కౌలుకు తీసుకున్నాను. నాలుగు ఎకరాల్లో బెండ, మొక్కజొన్న పంటలు సాగు చేసేందుకు పొలాన్ని సిద్ధం చేసుకున్నాను. యాప్‌తో సంబంధం లేకుండా రైతులకు కావాల్సిన ఎరువులను సరఫరా చేయాలి.
– వెంకటేశ్వర్లు, రైతు, జోళదరాశి,
కోవెలకుంట్ల మండలం


