ఈ చిత్రం బుధవారం టెక్కె మార్కెట్‌యార్డులో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమ’ సభలో కనిపించింది. సభకు మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి గురించి వారు చెప్పకుండా వైఎస్సార్‌సీపీ, ఆ పార్టీ నాయకులను విమర్శించడమే పనిగా చేసుకున్నారు. దీంతో వారి మాటలు వినలేక కొందరు అధికారులు అసహనానికి గురికాగా సభకు వచ్చిన ప్రజలు అక్కడి నుంచి జారుకున్నారు. మంత్రుల ప్రసంగాలకు ముందే ఖాళీ కుర్చీలు నవ్వుతూ కనిపించాయి. సభకు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, పలువురు ముఖ్య నాయకులు డుమ్మాకొట్టడం చర్చనీయాంశం అయ్యింది.
– నంద్యాల(అర్బన్)


