ఫర్టిలైజర్‌ డీలర్లు విలువలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఫర్టిలైజర్‌ డీలర్లు విలువలు పాటించాలి

Jun 17 2026 5:15 AM | Updated on Jun 17 2026 5:15 AM

ఫర్టిలైజర్‌ డీలర్లు విలువలు పాటించాలి బీఏఎస్‌ విద్యార్థుల చదువుకు ఆటంకం

బనగానపల్లె రూరల్‌: ఫర్టిలైజర్‌ దుకాణం డీలర్లు విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటునందించాలని ఏడీఆర్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం,జాన్సన్‌ సూచించారు. మంగళవారం మండలంలోని యాగంటిపల్లె గ్రామ సమీపంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో సీనియర్‌ శాస్త్రవేత్త ధనలక్ష్మీ అధ్యక్షతన వ్యవసాయ ఇన్‌పుట్‌ డీలర్స్‌ 2024–25వ సంవత్సరం ఉత్తీర్ణత పొందిన డీలర్లకు డిప్లొమా పట్టా పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్‌ జాన్సన్‌ మాట్లాడుతూ.. డీలర్లు నేర్చుకున్న వ్యవసాయ పరిజ్ఞానాన్ని రైతాంగానికి చేరవేయాలని, రైతులకు సమయానుకూల వ్యవసాయ సూచనలు, సలహాలు ఇచ్చి పెట్టుబడి తగ్గించాలన్నారు. ఎరువులు, పురుగు మందులు, పంటను చూసి రైతులకు నాణ్యమైన మందులను సిఫార్సు చేయాలన్నారు. ఆత్మ పీడీ బాలాజీనాయక్‌, దేశీ కార్యక్రమ సమన్వయ కర్త విశ్వనాథ్‌రెడ్డి, కేవీకే ఏఈ సురేష్‌కుమార్‌ శాస్త్రవేత్తలు, డీలర్లు పాల్గొన్నారు.

ఎమ్మిగనూరురూరల్‌: పట్టణంలోని నారాయణ పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఆ స్కూల్లో బీఏఎస్‌ (బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌) పథకం కింద ఎంపికై న విద్యార్థుల చదువు ఆటంకంగా మారింది. బీఏఎస్‌ పథకం కింద 2016 నుంచి నారాయణ పాఠశాలలో ఎం.అజయ్‌కుమార్‌, ఎం.సుదర్శన్‌, బి.హస్నమని (10వ తరగతి), జై.రీటాఅనైన్య (7వ తరగతి) చదువుతున్నారు. విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాలను పాఠశాల నిర్వాహకులు తప్పుగా నమోదు చేయడంతో పథకం కింద నిధులు బదాలాయింపు కాలేదు. తర్వాత తప్పు తెలుసుకొని బ్యాంకు ఖాతా వివరాలు సరిచేసి ప్రిన్సిపల్‌ సెక్రటరీ కార్యాలయానికి పంపగా నేటికి ఫైల్‌ పెండింగ్‌లో ఉంది. అన్ని కార్పొరేట్‌ స్కూళ్లకు బీఏఎస్‌ కింద బకాయిలు మంజూరుకాగా స్థానిక నారాయణ స్కూల్‌కు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తోంది. మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ను కలిసి బీఏఎస్‌ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు ఉన్నఫలంగా ఫీజులు చెల్లించాలంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ స్పందించి ఎమ్మిగనూరు విద్యార్థుల సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ సతీష్‌కుమార్‌ను వివరణ కోరగా విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా నమోదు కావడంతో నిధులు మంజూరు కాలేదని చెప్పారు. వివరాలు సరిచేసి పంపామని, ఇంకా అప్రూవ్‌ కాలేదని, విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు

డోన్‌ టౌన్‌: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఇద్దరు నిందితులకు డోన్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ నూరుల్లా జైలు శిక్ష విధించారు. పట్టణ సీఐ ఇంతియాజ్‌బాషా తెలిపిన వివరాల మేరకు.. పట్టణ పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన పట్టణానికి చెందిన కేఈ సురేంద్రగౌడ్‌, ఎన్‌.నాగరాజులపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. సురేంద్రగౌడ్‌కు మూడు రోజులు, నాగరాజుకు నాలుగు రోజులు జైలు శిక్షలు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement